టీడీపీ మినీ మహానాడులో షాకింగ్ ఘటన.. ఎమ్మెల్యే ముందే కార్యకర్త ఆత్మహత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత.. టీడీపీ తొలిసారి మహానాడు నిర్వహించనుంది. ఇందుకోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మహానాడు నిర్వహించడానికి ముందు ప్రతి నియోజకవర్గంలో మినీ మహానాడు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే ఈరోజు అనంతపురం అర్బన్‌లో జరిగిన టీడీపీ మినీ మహానాడులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

స్థానిక కమ్మ భవన్‌లో మినీ మహానాడు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నేతృత్వం వహిస్తున్నారు. అయితే ర్టీ కోసం కష్టపడిన తమకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే ఎదుటే వెంకటేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సదరు కార్యకర్తను సాకే వెంకటేష్ గా గుర్తించారు.

tdp-activist-suicide-attempt-at-mini-mahanadu-on-ananthapuram

వెంకటేష్ ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. ఆర్ఎంపీ డాక్టర్‌గా పని చేస్తూ రాజకీయంగా కూడా టీడీపీలో యాక్టివ్ గా ఉంటారని అంటున్నారు. గత వైసీపీ పాలనలో అనేక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ.. అర్బన్ నియోజకవర్గంలో తనకు గుర్తింపు లేదన్న భావనతో తీవ్ర నిరాశకు లోనై పురుగుల మందు ఆత్మహత్యాయత్నం చేసినట్టు వాపోతున్నారు. దాంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.

ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి వెంకటేష్‌ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో మహానాడు మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం అతని ఆరోగ్యం స్థిరంగానే ఉందని వైద్యులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+