జగన్ కు ఊహించని షాక్ ఇచ్చిన టిడిపి కార్యకర్త! ఏం చేశాడంటే?
పశ్చిమ గోదావరి:ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురలో పాదయాత్ర చేస్తున్న జగన్ కు బుధవారం వింత అనుభవం ఎదురైంది. ఇక యువకుడు తాను టిడిపి కార్యకర్తనంటూ జగన్ వద్దకు వచ్చి అందుకు రుజువుగా టిడిపి గుర్తింపు కార్డు కూడా చూపించాడు.
ఆ యువకుడు ఏదైనా విషయంలో తనను నిలదీపేందుకు వచ్చాడని భావించిన జగన్ కు అతడు చేసిన అనూహ్యమైన పని షాక్ నిచ్చింది. హఠాత్తుగా ఆ యువకుడు చేసిన పనికి జగనే కాదు అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆ యువకుడు తాను ఆ పని ఎందుకు చేశాడో వివరించడంతో ఆ తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడంటే?...

176వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో ప్రజలతో మమేకం అయ్యారు. కొప్పర్రు శివారు(నైట్ క్యాంప్) నుంచి బుధవారం ఉదయం కొప్పర్రు నుంచి లిఖితపూడి, సరిపల్లి మీదుగా పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక యువకుడు జగన్ వద్దకు చేరుకొని తన పేరు మురళీ కృష్ణ అని తాను టిడిపి కార్యకర్తనని పరిచయం చేసుకున్నాడు. మాది విజయవాడ అని...ప్రస్తుతం భీమవరంలోని మా బంధువుల జ్యూస్ షాప్‌లో కూలీగా పనిచేస్తున్నానని చెప్పాడు.
నిజానికి తాను ఈ పాటికి ఉద్యోగం చేసుకుంటూ ఉండాలని...తాను అభిమానించిన టీడీపీ తనను మోసం చేసిందని చెప్పాడు. తెలుగుదేశం పార్టీకి జెండాలు కట్టడం దగ్గర్నుంచి తాను అన్ని పనులూ చేశానని...తన సేవలకు మెచ్చిన టిడిపి నేతలు చదువుకున్న తనకుఏదో ఒక బతుకుదెరువు చూపిస్తామన్నారని..దీంతో తాను సంతోషపడ్డానని చెప్పాడు. అయితే ఆ తరువాత ఉద్యోగం గురించి ఆ టిడిపి నేతల దగ్గరకు వెళితే...డబ్బులిస్తేనేగానీ ఉద్యోగం రాదని అంటున్నారని చెప్పాడు.
ఆ తర్వాత ఉన్నట్టుండి చంద్రబాబూ...నన్ను వాడుకున్నారు...ఇదిగో చూడు అంటూ పార్టీ గుర్తింపు కార్డుని కిందపడేసి తొక్కాడు.
ఆ తర్వాత తాను అలా ఎందుకుచేశాడో వివరిస్తూ...మూడు లక్షలు ఇస్తే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లోనో, మంగళగిరి రిజిస్ట్రేషన్ ఆఫీసులోనో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం పెట్టిస్తామని టిడిపి నేతలు అంటున్నారని...నా దగ్గర అంత స్థోమత లేదని కన్నీళ్లతో చెప్పుకొచ్చాడు. రాబోయే తమ ప్రజా ప్రభుత్వంలో మురళీకృష్ణ లాంటి వారందరికీ న్యాయం జరుగుతుందని వైఎస్ జగన్ ఈ సందర్భంగా ఆ యువకుడికి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications