మోడీ, జగన్, పవన్‌కల్యాణ్‌ల ఫ్లెక్సీలు దహనం చేసిన టిడిపి కార్యకర్తలు
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడుతున్నారంటూ కర్నూలులో టిడిపి కార్యకర్తలు మోదీ, జగన్, పవన్ ఫ్లెక్సీలను దహనం చేశారు. దీంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీరు ముగ్గురూ ఏకమై ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధులను, పథకాలను అడ్డుకుంటున్నారని, అందుకే వీరి ఫ్లెక్సీలను దగ్థం చేసినట్లు ఈ సందర్భంగా టిడిపి కార్యకర్తలు తెలిపారు. వీరికి రాష్ట్ర ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.

మరోవైపు టిడిపి ఎమ్మెల్సీ బుధ్దా వెంకన్నమాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో సచివాలయంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి బీజేపీ, వైసీపీ, జనసేన నేతలు ముందుగా అనుకునే మూకుమ్మడిగా రాకుండా ఎగ్గొట్టారని ఆరోపించారు. దీంతో పవన్, జగన్, బీజేపీ మహా కుట్ర బట్టబయలైందన్నారు. అలాగే అఖిలపక్ష భేటీకి దూరంగా ఉండడం సిగ్గుమాలిన చర్య బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications