తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోకేష్‌కు మంత్రి పదవి, బాబు ఆగ్రహం: తండ్రీకొడుకుల చెవిలో గుసగుస (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతిలో మహానాడు కొనసాగుతోంది. రెండో రోజైన శనివారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆగ్రహం వచ్చింది. లోకేశ్‌ను రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకోవాలని మహానాడులో ఆయన అభిమానులు ఫ్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు.

దీంతో ఒక్కసారిగా అందరి చూపు అటువైపు మళ్లడంతో ఆగ్రహించిన చంద్రబాబు ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటే లిఖిత పూర్వకంగా తనకు అందజేస్తే పరిశీలిస్తానని, అలా కాకుండా సమావేశానికి అటంకం కలిగిస్తే సహించబోమని హెచ్చరించారు.

మహానాడు ఏ ఒక్కరి కోసమో ఏర్పాటు చేసింది కాదని, టిడిపి సమావేశమంటే క్రమశిక్షణతో సాగే కార్యక్రమమన్నారు. నినాదాలు చేసేవారు సంయమనం పాటించాలని అనడంతో ఎక్కడివారక్కడే మిన్నకుండిపోయారు.

మహానాడు

మహానాడు

ప్రాంగణమంతా రెండోరోజు పెద్దఎత్తున కిటకిటలాడింది. ఎండ మండుతున్నా ఎవరూ లెక్కచేయలేదు. కొందరు ఎండలోనే నిల్చుని తిలకించారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మహానాడు

మహానాడు

మహానాడు నిర్వహణపై సర్వే నిర్వహించిన అధినేత చంద్రబాబు తనదైన శైలిలో శ్రేణులకు చురకలు వేయడమేకాక.. భవిష్యత్తు పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే సందేశాన్నిచ్చారు. ఇలాచేయడం అసలు టిడిపి ప్రమాణాలకే సరిపోదని వ్యాఖ్యానించడం ఏర్పాట్ల తీరును తేటతెల్లం చేసింది.

లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వాలని..

లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వాలని..

లోకేశ్‌ను రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకోవాలని మహానాడులో ఆయన అభిమానులు ఫ్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా అందరి చూపు అటువైపు మళ్లడంతో ఆగ్రహించిన చంద్రబాబు ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటే లిఖిత పూర్వకంగా తనకు అందజేస్తే పరిశీలిస్తానని, అలా కాకుండా సమావేశానికి అటంకం కలిగిస్తే సహించబోమని హెచ్చరించారు.

 లోకేష్‌కు మంత్రి పదవి, బాబు ఆగ్రహం: తండ్రీకొడుకుల చెవిలో గుసగుస (పిక్చర్స్)

లోకేష్‌కు మంత్రి పదవి, బాబు ఆగ్రహం: తండ్రీకొడుకుల చెవిలో గుసగుస (పిక్చర్స్)

మహానాడు ఏ ఒక్కరి కోసమో ఏర్పాటు చేసింది కాదని, టిడిపి సమావేశమంటే క్రమశిక్షణతో సాగే కార్యక్రమమన్నారు. నినాదాలు చేసేవారు సంయమనం పాటించాలని అనడంతో ఎక్కడివారక్కడే మిన్నకుండిపోయారు.

మహానాడు

మహానాడు

చదువుకున్న ప్రతి పిల్లాడికి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పిన మాట నిలబెట్టుకుంటామని మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు మహానాడు రెండో రోజు ప్రకటించారు.

మహానాడు

మహానాడు

శనివారం తిరుపతి మహానాడులో పరిశ్రమలు-పెట్టుబడుల ఆకర్షణ అంశంపై ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రతిపాదించిన తీర్మానంపై ఆయన మాట్లాడారు.

మహానాడు

మహానాడు

నేను సరదా కోసం దేశాలు, రాష్ట్రాలు తిరగడం లేదని, ఏపీ అభివృద్ధి, పిల్లల ఉద్యోగం కోసం తిరుగుతున్నానని, ఏపీలోని వనరులను వివరించడం ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని, రాబోయే మూడేళ్లలో ఏపీకి భారీ పెట్టుబడులు రానున్నాయని చంద్రబాబు చెప్పారు.

మహానాడు

మహానాడు

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ రక్తదానం చేసిన తరవాత, ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా అన్ని ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు.

మహానాడు

మహానాడు

క్రియేటివిటీ కలిగిన పిల్లలు చాలా మంది ఉన్నారని, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ధ్యేయమని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రాన్ని మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌గా తయారు చేస్తామని తెలిపారు.

మహానాడు

మహానాడు

ఏపీ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

మహానాడు

మహానాడు

మహానాడు రెండోరోజు శనివారం విజయవంతంగా సాగింది. స్వచ్ఛందంగా తరలి వచ్చిన శ్రేణుల ఆనందోత్సాహాల నడుమ ఆయా రాష్ట్రాల్లో కీలక అంశాలపై అర్థవంతమైన సమగ్ర చర్చ నడిచింది.

బాలకృష్ణ

బాలకృష్ణ

మహానాడు రెండో రోజైన శనివారం నాడు వేదిక పైన మాట్లాడుతున్న హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.

మహానాడు

మహానాడు

తుదిగా రాజకీయ తీర్మానం.. అధినేత మార్గదర్శనంతో మూడ్రోజుల మహా పండుగ అధినేత చంద్రబాబు ప్రకటించిన నిర్దేశిత సమయానికే.. శనివారం ఉదయం 9.30 గంటలకే సరిగ్గా ఆరంభమైన మహానాడు రెండోరోజు కార్యక్రమాలు నిరాటంకంగా రాత్రి 8.30గంటల వరకు సాగాయి.

మహానాడు

మహానాడు

మధ్యాహ్న భోజనాలను ఎంపీ మాగంటిబాబు, మాజీమంత్రి గల్లా అరుణ కుమారి పర్యవేక్షించారు. తరలివచ్చిన ప్రతినిధులకు చక్కటి భోజనాన్ని అందించారు.

మహానాడు

మహానాడు

ఎక్కడా తొక్కిసలాట లేకుండా చూసేవీలుగా పోలీసులు వేదికకు కుడివైపున రెండువరుసలుగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.
మహానాడు

మహనాడు

మహనాడు

ఎక్కడా ఎవరూ అలుపన్నదే ఎరుగలేదు. ఎవరూ బయటకు వెళ్లనేలేదు. మధ్యాహ్నం కొద్దిసేపు మినహా అధినేత చంద్రబాబు సహా నాయకులు సైతం వేదిక దిగనే లేదు. తొలిగా ఎన్టీఆర్‌కు నివాళి అర్పించి కేకుకోసి అందరికీ పంచారు. ఆపై తీర్మానాలపై చర్చ ఆరంభమైంది.

మహానాడు

మహానాడు

మంత్రి పరిటాల సునీత జన్మదినోత్సవ వేడుకలను వేదికపైనే నిర్వహించడమేకాక.. ఆమెను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ఇక ఉదయానికే వివిధ ప్రాంతాలనుంచి ప్రతినిధులు స్వచ్ఛందంగా తరలివచ్చారు.

English summary
TDP activists demand minister post to Nara Lokesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X