వక్ఫ్ బిల్లులో వైసీపీ ఎంపీ క్రాస్ ఓటింగ్ - బీజేపీ గేమ్..!?

ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత రాజ్యసభ.. శాసన మండలిలో ఆ పార్టీ సభ్యులు కూటమి వైపు వెళ్తున్నారు. ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ ఎంపీలు కూటమిలో చేరగా..సాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇక, తాజాగా వక్ఫ్ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం వేళ ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వైసీపీ నిర్ణయించింది. లోక్ సభలో వ్యతిరేకంగా ఓటింగ్ చేసారు. రాజ్యసభ లో మాత్రం వైసీపీ ఎంపీ ఒకరు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. ఏం జరుగుతోంది..

రాజ్యసభలో ఏం జరిగింది
వక్ఫ్ బిల్లును వైసీపీ వ్యతిరేకించాలని నిర్ణయించింది. లోక్ సభలో వైసీపీకి చెందిన నలుగురు సభ్యులు వ్యతిరేకంగా ఓటింగ్ చేసారు. ఈ బిల్లుకు ఏపీ నుంచి ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు గా ఉన్న టీడీపీ, జనసేన మద్దతు ఇచ్చారు. కొన్ని సవరణలు ప్రతిపాదించిన టీడీపీ బిల్లుకు మద్దతు ఇచ్చింది. జనసేన అధికారికంగా తాము బిల్లుకు మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. టీడీపీ నిర్ణయం తో ఏపీలోని ముస్లిం వర్గాలు నిరసనలు నిర్వహించాయి. ఇదే సమయంలో వైసీపీ పైన టీడీపీ గురి పెట్టింది. వైసీపీ రాజ్యసభలో అనుకూలంగా ఓటింగ్ చేసిందని టీడీపీ నేతలు ఆరోపించారు. దీని పైన వైసీపీ స్పందించింది.

tdp-alleges-ysrcp-supported-waqf-bill-in-rajyasabaha-what-happen-in-upper-house

ఎంపీ క్రాస్ ఓటింగ్..?
రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని వైసీపీ తమ పార్టీ సభ్యులకు విప్ జారీ చేసింది. రాజ్యసభలో ప్రస్తుతం వైసీపీకి ఏడుగురు సభ్యులు ఉన్నారు. కాగా, ఒక వైసీపీ సభ్యుడు బిల్లుకు అనుకూలంగా ఓటు వేసినట్లు ప్రచారం సాగుతోంది. వ్యక్తిగతంగా ఎవరు క్రాస్ ఓటింగ్ చేసారనే అంశం పైన ఓపెన్ గా చెప్పే అవకాశం ఉండదనే చర్చ ఉంది. ఇదే సమయంలో పెద్దల సభలో వ్యతిరేక ఓట్లు లెక్క కంటే ఒకటి ఎక్కువగా వచ్చిందని.. వైసీపీకి చెందిన ఒక సభ్యుడు క్రాస్ ఓటింగ్ చేసారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందులో భాగంగా వైసీపీకి చెందిన ఒక సబ్యుడి పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆ సభ్యుడి తో నేరుగా బీజేపీ నేతల సంప్రదింపులతో ఆయన బిల్లుకు అనుకూలంగా ఓటింగ్ చేసారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

Take a Poll

బీజేపీ ఒత్తిడి చేసిందా..!?
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త సీఎం నివాసానికి వచ్చి తమ సంస్థల్లో కీలకంగా ఉన్న వ్యక్తికి రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరారు. దీనికి అంగీకరించిన జగన్ రాజ్యసభ సీటు ఖరారు చేసారు. కేంద్రంలో వైసీపీ - బీజేపీ మధ్య ఆ ఎంపీ సైతం కీలకంగా వ్యవహ రించారు. కాగా, ఇప్పుడు బీజేపీకి వక్ప్ బిల్లు ప్రతిష్ఠాత్మకం కావటంతో ఆ పార్టీ నేతలు వైసీపీ ఎంపీ పైన ఒత్తిడి చేయటం ద్వారా.. క్రాస్ ఓటింగ్ చేసారని భావిస్తున్నారు.

వైసీపీ నేతలు అంతర్గత చర్చల్లో మాత్రం ఈ ఎంపీ ఓటింగ్ పైన తమకు సమాచారం షేర్ చేసుకుంటున్నారు. టీడీపీ చేస్తున్న ఆరోపణల వేళ రాజ్యసభలో జరిగిన ఓటింగ్ లో ఆ ఎంపీ క్రాస్ ఓటింగ్ చేసినట్లు ఏ విధంగా నిరూపణ చేయాలి.. విప్ ధిక్కరించినట్లు నిర్ధారణ అయితే వైసీపీ ఏం చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+