తొలి ట్రెండ్స్ లో టీడీపీ కూటమి అధిక్యత - ఎవరెక్కడ..!!
హోరా హోరీగా సాగిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో తొలి ట్రెండ్స్ వెల్లడవుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ లో టీడీపీ కూటమి అభ్యర్దుల ఆధిక్యత కనిపిస్తోంది. ఈ సారి ఈవీఎంతో పాటుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కంపు కొనసాగుతోంది. తొలి ట్రెండ్స్ లో రాజమండ్రి రూరల్, నెల్లూరు సిటీ ఫలితాలు వస్తున్నాయి. రాజమండ్రి రూరల్ లో టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి లీడ్ లోఉన్నారు.అదే విధంగా నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్ది నారాయణ లీడ్ లోకనిపిస్తున్నారు.
రాజమండ్రి రూరల్ లో టీడీపీ కూటమి అభ్యర్ది రోగంట్ల బుచ్చయ్య చౌదరి రెండో రౌండ్ పూర్తయ్యే సరికి 2200 ఓట్ల లీడ్ లో కొనసాగుతున్నారు. కుప్పంలో చంద్రబాబు 1549 ఓట్లతో ముందంజలో నిలిచారు. రాజమండ్రి రూరల్ లో తొలి రౌండ్ లోటీడీపీకి 5795 ఓట్లు రాగా, వైసీపీకి 4885 ఓట్లు వచ్చాయి. అదే విధంగా నెల్లూరు సిటీ లో మాజీ మంత్రి నారాయణ, మండపేటలో టీడీపీ అభ్యర్ది జోగేశ్వరరావు లీడ్ లో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ లో టీడీపీ కూటమి అధిక్యత సాధిస్తుందని తొలి నుంచి అంచనాలు ఉన్నాయి.

మొత్తం పోస్టల్ బ్యాలెట్ లో 60 శాతానికి పైగా ఓట్లు టీడీపీ కూటమి సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసాయి. రాజమండ్రి రూరల్ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ అంచనాలు వెల్లడి అవుతున్నాయి. అయితే, ఈవీఎం కౌంటింగ్ ఒక్కో రౌండ్ అరగంట సమయం తీసుకొనే అవకాశం ఉంది. దాదాపు 25-30 స్థానాల్లో నువ్వా నేనా అన్నట్లుగా ఓట్లు దక్కే అవకాశం కనిపిస్తోంది. విజేత ఖరారులో ఈ సీట్ల ఫలితమే కీలకం కానుంది. దీంతో..ఫలితం పూర్తిగా వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని రెండు పార్టీలు తమ ఏజెంట్లను అప్రమత్తం చేసాయి.
పిఠాపురంలో పోస్టల్ బ్యాలెట్ ఎక్కువగా చెల్లని ఓట్లను గుర్తించారు. ఈ పరిణామం ఆసక్తి కరంగా మారుతోంది. పాణ్యం అసెంబ్లీ, నంద్యాల ఎంపీ స్థానంలో టీడీపీకి లీడ్ కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా ఎన్డీఏకు పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తున్నట్లు ప్రస్తుత ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. దీంతో..ఏపీలోనూ టీడీపీ కూటమి నేతలు భారీ ఆశలతో కనిపిస్తున్నారు. మరి కాసేపట్లో ఓటర్లు ఎవరి వైపు నిలిచారనేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications