టీడీపీ కూటమి మేనిఫెస్టో అమలు ఇలా చేస్తే సాధ్యమే: యనమల రామకృష్ణుడు క్లారిటీ

టిడిపి- జనసేన- బిజెపి ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ మేనిఫెస్టో అమలు సాధ్యాసాధ్యాలపైన ఏపీ రాజకీయ వర్గాల్లోనూ, ప్రజలలోను ఆసక్తికర చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో ఆచరణ సాధ్యమైన మేనిఫెస్టో నేనా అన్న చర్చ జరుగుతున్న వేళ టిడిపి కూటమి మేనిఫెస్టో పై టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్పందించారు.

టీడీపీ కూటమి మేనిఫెస్టో ఉద్దేశం ఇదే
కూటమి మేనిఫెస్టో అందరికీ ఆమోదయోగ్యంగానే ఉందని ప్రజలు చెబుతున్నారని, ఒక్క వైసీపీ తప్ప మిగిలిన రాజకీయ పార్టీలన్నీ మెచ్చుకున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ మేనిఫెస్టో కారణంగా ప్రజలకు మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం నాశనం చేసిందని, ఈ వినాశనం నుండి ఉన్నత స్థితికి ఏపీని తీసుకు వెళ్లడం కోసమే ప్రజా మేనిఫెస్టో రూపొందించామని యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు.

TDP alliance manifesto Implementation is possible Yanamala Ramakrishnudu Clarity

ఇది పూర్తిగా అమలు చేయదగిన మేనిఫెస్టో
ఈ మేనిఫెస్టో తో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కూటమి మేనిఫెస్టో పై ఎవరికైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఇది పూర్తిగా అమలు చేయదగిన మేనిఫెస్టో అని ఆయన వివరించారు. రాష్ట్రంలో అనవసరపు ఖర్చులు తగ్గిస్తే 2000 నుంచి 3000 కోట్ల రూపాయల వరకు ఆదా చేయొచ్చని, వ్యవస్థలను గాడిలో పెట్టడం ద్వారా ఆదాయాన్ని పెంచుతామన్నారు.

అభివృద్ధి ఉంటేనే ఆదాయ సృష్టి
నాన్ టాక్స్, ఓన్ టాక్స్ రెవెన్యూలు పెరిగేలా దృష్టి పెడతామని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. తాము ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎక్కువ నిధులను తీసుకువచ్చేలా ప్రణాళికలు వేస్తామని, అభివృద్ధి ఉంటే ఆదాయం సృష్టి జరుగుతుందని యనమల అభిప్రాయం వ్యక్తం చేశారు.

అప్పుల కోసం జగన్ పాకులాట.. ఆదాయం కోసం మా దృష్టి
డీవాల్యూషన్ ఫండ్ షేర్ 50% చేయాలని డిమాండ్ పెట్టి కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. వైద్య ఆరోగ్యం కోసం వైసిపి ఒక శాతం కూడా ఖర్చు చేయలేదని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని అమల్లోకి తీసుకొస్తామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అప్పుల కోసం పాకులాడితే, తాము ఆదాయ వనరులు పెంచడం పైన దృష్టి సారించి సంపదను సృష్టిస్తాం అన్నారు. ఐటి, టూరిజం రంగాలను ప్రోత్సహించడం ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+