మరో ఛాన్స్‌ను చంద్రబాబు మిస్ చేసుకుంటోన్నారా?

Chandrababu Naidu: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిపై పెత్తనాన్ని చలాయించే అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి కోల్పోనున్నారా?, పెద్దగా ప్రాధాన్యత లేని శాఖలతోనే ఆయన సరిపెట్టుకోనున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది.

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ 292 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 272 మంది సభ్యుల సంఖ్యాబలం అవసరం. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం లేకపోయినప్పటికీ- భాగస్వామ్య పక్షాల సహాయంతోఈ మేజిక్ ఫిగర్‌ను అందుకుంది బీజేపీ.

TDP and JDU will support person nominated by BJP as Lok Sabha speaker says KC Tyagi

ఈ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా లభించింది 240 సీట్లు మాత్రమే. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అండతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. మేజిక్ ఫిగర్ కంటే 20 సీట్లు మాత్రమే అధికంగా లభించిన నేపథ్యంలో టీడీపీ- 16, జేడీయూ- 12 సీట్లు అత్యంత కీలకంగా మారాయి బీజేపీకి.

టీడీపీకి చెందిన ఎంపీల్లో కింజరాపు రామ్మోహన్ నాయుడికి పౌర విమానయానం, పెమ్మసాని చంద్రశేఖర్‌కు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి పదవి దక్కింది. ఈ రెండూ కూడా టీడీపీకి విమర్శలను తెచ్చిపెడుతున్నాయి. ప్రత్యేకించి- రామ్మోహన్ నాయుడికి కేటాయించిన పౌర విమానాయానం.

ఈ శాఖ ఆధీనంలో ఒక్క విమానం కూడా లేదు. విమానాలు లేని పౌర విమానయాన శాఖగా గుర్తింపు ఉంది దీనికి. ఇదివరకు ఎయిరిండియా కేంద్రం ఆధీనంలోఉన్నప్పటికీ.. దాన్ని అమ్మేసింది. 18,000 కోట్ల రూపాయలకు టాటాలు దాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ శాఖ అప్రాధాన్యత కేటగిరి కిందికి వెళ్లిపోయింది. దీన్ని తీసుకోవడం పట్ల విమర్శలు తలెత్తాయి.

TDP and JDU will support person nominated by BJP as Lok Sabha speaker says KC Tyagi

ఎన్డీఏ.. ప్రత్యేకించి బీజేపీపై పెత్తనాన్ని చలాయించడానికి వచ్చిన మరో గోల్డెన్ ఛాన్స్‌ను కూడా తెలుగుదేశం పార్టీ పోగొట్టుకోవడం ఖాయమనే అభిప్రాయాలు ఉన్నాయి. అదే- లోక్‌సభ స్పీకర్ పోస్ట్. బీజేపీని, ఎన్డీఏను ఏకకాలంలో అదుపులో ఉంచగల సామర్థ్యం ఉన్న పోస్ట్ ఇది. దీన్ని వదలుకుంటుందని తెలుస్తోంది.

జేడీయూ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు కేసీ త్యాగి తాజాగా చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. తెలుగుదేశం పార్టీ, జేడీయూ ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో భాగస్వామిగా ఉన్నాయని ఆయన తేల్చి చెప్పారు. లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎవరిని నామినేట్ చేసినా టీడీపీతో కలిసి తాము మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+