Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డ్యామిడ్.. జగన్ బ్యాండేజీ కథ అడ్డం తిరిగిందన్న టీడీపీ.. లోకేష్ సంచలన పోస్ట్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఒక పార్టీపై ఒకటి తీవ్ర స్థాయిలో సోషల్ మీడియా వేదికగా దాడికి దిగుతున్నాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన విజయవాడలో రాయి దాడి ఘటన జరిగిన తర్వాత, ఆ గాయానికి కుట్లు పడ్డాయని, బ్యాండేజ్ వేసుకుని జగన్ ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్న విషయం తెలిసిందే.

జగన్ బ్యాండేజ్ పై రచ్చ
అయితే సోషల్ మీడియా వేదికగా జగన్ బ్యాండేజ్ వేసుకుని కనిపించడం పైన మీమ్స్ మోత మోగుతున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి మద్దతుగా ఉన్న కొందరు ముఖాలకు బ్యాండేజ్ లు వేసుకొని సోషల్ మీడియాలో జగన్ ను తమదైన శైలిలో ఎద్దేవా చేశారు. జగన్ సోదరి సునీత జగన్ బ్యాండేజ్ విషయంలో సలహా ఇచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దీనిపైన రచ్చ కొనసాగింది.

TDP and nara lokesh targets jagan bandage removal episode

జగన్ బ్యాండేజ్ విషయంలో సునీత వ్యాఖ్యలే హైలైట్
దీంతో తాజాగా జగన్ బ్యాండేజ్ తీసేయడంతో టిడిపి జగన్ తీరును ట్రోల్ చేస్తుంది. బ్యాండేజ్ వేసుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్న జగన్ కు ఆయన సోదరి డాక్టర్ సునీత జగన్ కు గాయం కావడం దురదృష్టకరమని అంటూనే, వైద్య పరంగా ఎవరో తప్పుడు సలహాలు ఇస్తున్నారని, గాయం లేనప్పుడు ఎక్కువ రోజులు పాటు బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదన్నారు. దానివల్ల సెప్టిక్ అయ్యి గాయం ఇంకా పెద్దది అవుతుందన్నారు.

బ్యాండేజ్ తీసేసిన జగన్.. టీడీపీ సెటైర్లు
గాయాన్ని మామూలుగా గాలికి వదిలేస్తే అది త్వరగా మానుతుంది అని చెప్పారు. ఓ డాక్టర్ గా బ్యాండేజ్ తీసేస్తే మంచిదని తాను సలహా ఇస్తున్నాను అని సునీత చెప్పారు. ఇక ఆ తర్వాత ఇప్పుడు జగన్ బ్యాండేజ్ తీసేసారు. దీంతో టీడీపీ డామిడ్.. బ్యాండేజీ కథ అడ్డం తిరిగింది అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది.

మచ్చ కూడా లేదే... టీడీపీ ఆశ్చర్యం
అంతేకాదు బ్యాండేజి పోయింది... కనీసం బుర్ర మీద మచ్చ కూడా లేదు.. కుట్లు వేస్తే, కనీసం ఆ ఆనవాళ్ళు కూడా లేవు అంటూ పోస్ట్ చేసింది.జగన్ గాయం తాలూకా చిన్న మచ్చ కూడా ఆయన ముఖం మీద లేకపోవడంతో ఇదేలా సాధ్యం అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

జూమ్ చేసి చూస్తే దెబ్బ మటుమాయం: లోకేష్
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా జగన్ బ్యాండేజ్ పై పోస్టు పెట్టారు. ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం, జూమ్ చేసి చూస్తే దెబ్బ మటుమాయం అంటూ ఆయన జగన్ ఫోటోలతో పోస్టులు పెట్టారు. మొత్తానికి ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి ఏ చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు ఏపీ పొలిటిషియన్స్.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+