వచ్చే ఎన్నికల్లో దళిత ప్రతిఘటన ఓట్లు జగనే కాదు, రాజారెడ్డి వచ్చినా అడ్డుకోలేరు : అనిత, సుజాత ధ్వజం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలన పై, వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో కొనసాగుతున్న అరాచకంపై టిడిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ మంత్రి పీతల సుజాత ఫైర్ అయ్యారు. దళితులను ఉద్దరిస్తాం అంటున్న వైసిపి దళిత ప్రతిఘటన ర్యాలీని ఎందుకు అడ్డుకుందని టీడీపీ మహిళా నేతలు ప్రశ్నించారు. దళిత ప్రతిఘటన ర్యాలీని అడ్డుకున్నా వచ్చే ఎన్నికలలో వైసీపీకి వ్యతిరేకంగా ఓట్ల రూపంలో జరిగే దళిత ప్రతిఘటనను సీఎం జగనే కాదు, రాజారెడ్డి దిగివచ్చినా అడ్డుకోలేరని వంగలపూడి అనిత తేల్చి చెప్పారు.

దళితులపై దాడులు నిత్యకృత్యంగా మారాయన్న అనిత
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని వంగలపూడి అనిత మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యంగా మారుతుంటే, నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అనిత జగన్ సర్కార్ ను నిలదీశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై కరోనా సాకు చూపి కేసులు పెడుతున్నారని వంగలపూడి అనిత మండిపడ్డారు.

దళితులకు న్యాయం చేయలేమని సీఎం జగన్ రెడ్డి చేతులెత్తేశారా
రాష్ట్రంలో ప్రభుత్వ దళిత వ్యతిరేక విధానాలకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్ లో దళిత ప్రతిఘటన ర్యాలీ నిర్వహించాలని భావిస్తే దానిని అడ్డుకోవడం దేనికని ప్రశ్నించిన అనిత, దళిత ప్రతిఘటన ర్యాలీని అడ్డుకున్నారు అంటే దళితులకు న్యాయం చేయలేమని సీఎం జగన్ రెడ్డి చేతులెత్తేశారా అంటూ ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థను నిందితులను, నేరాలకు పాల్పడిన వారిని శిక్షించడానికి కాకుండా, టిడిపి నేతలను ఇబ్బంది పెట్టడానికి సీఎం జగన్ రెడ్డి ఉపయోగిస్తున్నారని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.వైసిపి ప్రభుత్వ కార్యక్రమాలకు, బహిరంగ సభలకు కరోనా నిబంధనలు గుర్తుకు రావా అని ప్రశ్నించిన అనిత వైసిపి ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వం అన్నారు.

దళితులపై జగన్ కక్ష సాధింపు పై మండిపడిన మాజీ మంత్రి పీతల సుజాత
ఇదిలా ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ దళిత వ్యతిరేక విధానాలకు నిరసనగా టీడీపీ చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై టీడీపీ మహిళా నాయకురాలు, మాజీ మంత్రి పీతల సుజాత సైతం ద్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేదని ఆమె మండిపడ్డారు. రెండేళ్ల వైసీపీ పాలనలో దళితులపై ఎన్నో అక్రమ కేసులు బనాయించారని, వేధింపులకు గురి చేశారని పీతల సుజాత పేర్కొన్నారు. దళితుల పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ పీతల సుజాత విమర్శలు గుప్పించారు.

జగన్ మోహన్ రెడ్డి దళితులను కేవలం ఓటు బ్యాంకు గానే చూస్తున్నారని ధ్వజం
టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీ అడ్డుకోవడం ప్రభుత్వ పిరికిపంద చర్య కు నిదర్శనమని సుజాత అభిప్రాయం వ్యక్తం చేశారు. దళితులకు ఎవరు ఎంత మేలు చేశారో వైసీపీ ప్రభుత్వం చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దళితులను కేవలం ఓటు బ్యాంకు గానే చూస్తున్నారని మండిపడ్డారు. దళితుల పట్ల కక్షసాధింపు ఆపకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతామని పీతల సుజాత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డాక్టర్ సుధాకర్ ను వేధింపులకు గురి చేసి చంపేశారని, అవినీతిని ప్రశ్నించిన డాక్టర్ అనిత రాణి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని పీతల సుజాత జగన్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. జగన్ హయాంలో దళితులపై వేధింపులు నిత్యకృత్యంగా మారాయని ధ్వజమెత్తారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications