వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోసాని, పేర్ని నానీ.. గ్రామ సింహాలను అచ్చోసి బయటకు వదిలారా? జగన్ పై అనిత ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

టిడిపి తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీ సర్కార్ పై, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ విషయంలో కొనసాగుతున్న వివాదం పై మాట్లాడిన అనిత మంత్రి పేర్ని నాని, పోసాని కృష్ణమురళి మాటలు జుగుప్సాకరంగా ఉన్నాయంటూ మండిపడ్డారు. వారిద్దరిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని అనిత డిమాండ్ చేశారు.

డాక్టర్ సుధాకర్ మృతి జగన్ కారణం .. ఆయనపై చార్జ్ షీట్ తెరవండి

డాక్టర్ సుధాకర్ మృతి జగన్ కారణం .. ఆయనపై చార్జ్ షీట్ తెరవండి

డాక్టర్ సుధాకర్ మృతికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణమని, డాక్టర్ సుధాకర్ ను పిచ్చి వాడిగా ముద్రవేసి, వేధింపులకు గురి చేసి, ఆయన గుండెపోటుతో మరణించడానికి కారణమయ్యారని టిడిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రధాన ముద్దాయిగా చేర్చి చార్జిషీటు ఓపెన్ చేయాలని అనిత డిమాండ్ చేశారు. అధికారపార్టీ వేధింపులు తట్టుకోలేక డాక్టర్ సుధాకర్ ఎంతో మానసిక వేదనకు గురైన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అని అనిత అభిప్రాయపడ్డారు.

పవన్ రాజకీయ విమర్శలు చేస్తే రాజకీయంగా ఎదుర్కోండి .. కానీ ఇలా దిగజారాలా ?

పవన్ రాజకీయ విమర్శలు చేస్తే రాజకీయంగా ఎదుర్కోండి .. కానీ ఇలా దిగజారాలా ?


పవన్ కళ్యాణ్ రాజకీయ విమర్శలు చేస్తే వైసీపీ నేతలు రాజకీయంగా ఎదుర్కోవాలే తప్పా వ్యక్తిగత విమర్శలు చెయ్యకూడదని అనిత పేర్కొన్నారు. కానీ వైసీపీ నేతలు రాజకీయంగా మాట్లాడలేక, ఎవరినో మీడియా ముందుకు తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ నేతలు మహిళల పేర్లు వాడుకోవడం సిగ్గుచేటని అనిత అభిప్రాయపడ్డారు. అమ్మలూ, అక్కలూ, భార్యల నుండి బిడ్డలు వరకు వదలకుండా తీవ్ర పదజాలంతో మాట్లాడుతున్నారని, ఇలా మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. మహిళలను రోడ్డుమీదకు తీసుకు వచ్చినట్లుగా మాట్లాడుతున్నారంటే ఇంతకన్నా దిగజారుడుతనం ఉంటుందా అని ప్రశ్నించారు.

మంత్రి పేర్ని నాని, పోసాని కృష్ణ మురళిపై నిర్భయ చట్టం క్రింద కేసు నమోదు చెయ్యండి

మంత్రి పేర్ని నాని, పోసాని కృష్ణ మురళిపై నిర్భయ చట్టం క్రింద కేసు నమోదు చెయ్యండి

మీ నాయకుడు సమర్థుడైన నాయకుడు అయితే ఆయన సమర్ధత గురించి మాట్లాడాలి తప్ప, చేసిన అభివృద్ధి గురించి మాట్లాడాలి తప్ప మహిళల పేరుతో రాజకీయం చేయడం మంచిది కాదని మండిపడ్డారు. టీవీల ముందు పిల్లలతో కూర్చోలేని పరిస్థితులు కల్పిస్తున్నారని వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. మంత్రి పేర్ని నాని, పోసాని కృష్ణ మురళిపై మహిళలపై అసభ్యంగా మాట్లాడినందుకు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలను వైసీపీ నేతలు తిడుతుంటే ముఖ్యమంత్రికి సంగీత విభావరి విన్నట్టు ఉంటుందా అని వంగలపూడి అనిత ప్రశ్నించారు.

అచ్చోసిన గ్రామ సింహాలను బయటకు వదిలారా ?

అచ్చోసిన గ్రామ సింహాలను బయటకు వదిలారా ?


వైసీపీ నేతల భాష చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని అనిత పేర్కొన్నారు. ఈరోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై మాట్లాడుతున్న వారు రేపు మా పైన కూడా మాట్లాడతారని అనిత మండిపడ్డారు . గ్రామ సింహాలకు అచ్చు పోసి బయటకు వదిలారా అంటూ జగన్మోహన్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి నాయకులు మాట్లాడుతున్న స్క్రిప్ట్ అంతా తాడేపల్లి కొంప నుండి వస్తుందా అంటూ వంగలపూడి అనిత ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి సైకోలా ప్రవర్తిస్తున్నారు అంటూ అనిత ధ్వజమెత్తారు.

అయ్యన్న వ్యాఖ్యలే తప్పు అయితే మీరు మాట్లాడేది ఏంటో ? డైవర్షన్ పాలిటిక్స్ కాదా ఇది

రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు అఘాయిత్యాలు పెరిగిపోయాయని, నిత్యం మహిళల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయా అని ఇదంతా జగన్మోహన్ రెడ్డికి సంగీతంలా వినిపిస్తుందా అంటూ ప్రశ్నించారు . కోడెల శివప్రసాద్ రెండవ వర్ధంతి సందర్భంగా అయ్యన్నపాత్రుడు చెత్త... కొడకా అంటేనే హోం మంత్రి సుచరిత కు, జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ మంత్రులకు ఆగ్రహావేశాలు పెల్లుబికాయి అని మరిప్పుడు మీరు మాట్లాడుతున్న చండాలం ఏమిటి అని అసహనం వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోందని, లక్షల కోట్ల రూపాయల హెరాయిన్ వెనుక ఉన్న బిగ్ బాస్ ఎవరు అని రాష్ట్రం దృష్టి కేంద్రీకరించిన సమయంలో, కావాలని జగన్మోహన్ రెడ్డి మంత్రి పేర్ని నానిని, పోసాని కృష్ణ మురళి ని రంగంలోకి దించారని వంగలపూడి అనిత అభిప్రాయం వ్యక్తం చేశారు.

English summary
TDP Anitha fires on YCP govt in AP and CM Jagan. Anitha spoke on the ongoing controversy over Pawan Kalyan, was incensed that the words of Perni Nani and Posani Krishnamurali were offensive. Anitha demanded to register case against them under the Nirbhaya Act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X