• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బూతుల మంత్రులు మొరుగుతూనే ఉన్నారు..కొత్త పదాలు, కొత్త అర్ధాలతో; డీజీపీని వదలిపెట్టని టీడీపీ అనిత

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత వైసిపి నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై, ఆ పార్టీ నేతలపై వైసీపీ నేతలు మంత్రులు చేస్తున్న విమర్శలకు , పరుషపదజాలానికి అనిత ఘాటుగా సమాధానం చెప్పారు. మంత్రి కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, వైసీపీ ఎమ్మెల్యే రోజాలను తూర్పారబట్టారు అనిత. అంతేకాదు ఏపీ డీజీపీ పైన అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు

చంద్రబాబు గంట కళ్ళు మూసుకుంటే కథ వేరేలా ఉంటదన్న పరిటాల సునీత; తరిమికొడతామన్న దేవినేని ఉమా !చంద్రబాబు గంట కళ్ళు మూసుకుంటే కథ వేరేలా ఉంటదన్న పరిటాల సునీత; తరిమికొడతామన్న దేవినేని ఉమా !

ఆయన డీజీపీ కాదు డీజేపీ .. అంటే డైరెక్ట్ జగన్ పాలేరు

ఆయన డీజీపీ కాదు డీజేపీ .. అంటే డైరెక్ట్ జగన్ పాలేరు

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ టార్గెట్ చేసిన అనిత గౌతమ్ సవాంగ్ డిజిపి కాదని, డీజేపీని అనిత వ్యాఖ్యానించారు. డీజెపి అంటే డైరెక్ట్ జగన్ పాలేరు అని నిజం చెప్పారు అనిత. ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సమాధానం గా అనిత సీఎం జగన్ చెప్పినట్లు ఆ పార్టీ కార్యకర్తలకు వచ్చింది బీపీ కాదని జేపీ అని వ్యాఖ్యానించారు. జేపీ అంటే జగన్ ప్రెషర్ అంటూ, జగన్ ప్రెషర్ వల్లే దాడులు చేశారని అనిత కొత్త అర్ధాలు చెప్పారు. గాజులు తొడుక్కోలేదని మాట్లాడిన వైసీపీ నేతలకు గాజుల చేతులకు ఉండే పవర్ ఏంటో చూపిస్తామని అని తేల్చి చెప్పారు. గాజుల చేతులతోనే వీపులు పగలగొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అంటూ అనిత స్పష్టం చేశారు.

జబర్దస్ట్ కాల్షీట్లు అయిపోతే పొలిటికల్ స్క్రీన్ మీదకు .. రోజాపై ధ్వజం

జబర్దస్ట్ కాల్షీట్లు అయిపోతే పొలిటికల్ స్క్రీన్ మీదకు .. రోజాపై ధ్వజం

వైసీపీ ఎమ్మెల్యే రోజా పై విరుచుకు పడిన అనిత సిల్వర్ స్క్రీన్ మీద నుంచి అప్పుడప్పుడు పొలిటికల్ స్క్రీన్ మీదకు ఒక నేత వస్తుందని, జబర్దస్త్ కాల్షీట్లు అయిపోగానే ఖాళీగా ఉన్న సమయంలో పొలిటికల్ స్క్రీన్ మీద కొచ్చి ఏదేదో మాట్లాడుతుంది అని మండిపడ్డారు. జగన్ కాళ్లు, వెంట్రుకలు అంటూ రోజా వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్న అనిత జగన్ కాళ్ళు జనాలకు బాగానే కనిపిస్తున్నాయని, త్వరలోనే ఆయన కాళ్ళు పట్టుకుని లాగుతారు అంటూ సెటైర్ వేశారు.

 చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత హోం మంత్రికి లేదు .. ఎందుకంటే

చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత హోం మంత్రికి లేదు .. ఎందుకంటే

చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత హోంమంత్రి సుచరితకు లేదని ద్వజమెత్తారు వంగలపూడి అనిత హోంమంత్రి సుచరిత ఒక కీలుబొమ్మగా రబ్బరు స్టాంపుగా మారారని, మహిళలపై అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని హోంమంత్రి ని టార్గెట్ చేశారు అనిత. జగన్ రెడ్డి గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్న అనిత, భవిష్యత్తులో ప్రోత్సాహకాలు కూడా ఇస్తారంటూ ఎద్దేవా చేశారు.యువత భవిష్యత్తు ను సీఎం జగన్ నాశనం చేస్తున్నారని, ప్రశ్నించిన ప్రతిపక్షంపై దాడులు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే అనిత తీవ్ర విమర్శలు చేశారు.

YSR Rythu Bharosa: రైతు భరోసా పేరుతో మోసం, రైతుల ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా జమ కాలేదు : Anitha
బూతుల మంత్రులు మొరుగుతూనే ఉన్నారు

బూతుల మంత్రులు మొరుగుతూనే ఉన్నారు

ప్రశ్నిస్తే దాడులు చేస్తామని బెదిరిస్తున్నారని పేర్కొన్న అనిత ప్రతిపక్ష నేతది రాజ్యాంగబద్ధ పదవి కాదా అంటూ ప్రశ్నించారు. వైసీపీ నేతల భాష ఎలా ఉందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని పేర్కొన్న అనిత బూతుల మంత్రులందరూ ఉదయం నుండి మొరుగుతూనే ఉన్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళలను అవమానిస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. సన్న బియ్యం సన్నాసి ఓ మంత్రి మాటకు ముందు అమ్మ మాటకు తర్వాత అమ్మ అంటున్నాడని కొడాలి నాని పై ధ్వజమెత్తారు. ఆ మంత్రి ఏ అమ్మ గురించి మాట్లాడుతున్నారో ? ఏ అమ్మకు పుట్టారో ఆయనకే తెలియాలి అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు అనిత. తాట తీస్తాం , తోలు ఒలుస్తామని రారా పోరా అంటూ ఓ మంత్రి వ్యాఖ్యలు చేస్తున్నాడని కచ్చితంగా తగిన బుద్ధి చెబుతామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు వార్నింగ్ ఇచ్చారు అనిత.

English summary
TDP Anitha reacted sharply to the criticism of the YCP leaders against Chandrababu and tdp leaders. Minister Kodali Nani, Anil Kumar Yadav and YCP MLA Roja were targeted by Anitha. Moreover, Anita made sensational remarks on AP DGP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X