బీజేపీ ట్రాప్ లో చంద్రబాబు, బిగ్ టర్న్ - పవన్ ఎవరి వైపు..!?

ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది. బీజేపీతో టీడీపీ పొత్తు ఖాయమైందని భావిస్తున్న వేళ కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా ప్రధానితో సీఎం జగన్ సుదీర్ఘ భేటీతో కొత్త రాజకీయ అంచనాలు చర్చకు కారణమవుతున్నాయి. దీంతో అసలు పొత్తు ఉంటుందా..ఉండదా అనే విశ్లేషణలు మొదలయ్యాయి. మరి..జనసేనాని పవన్ ఏం చేయబోతున్నారు. ఎవరి వైపు నిలుస్తారు. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇది మరింత ఆసక్తి కరంగా మారుతోంది.

ఢిల్లీ మార్క్ రాజకీయం : బీజేపీ ట్రాప్ లో చంద్రబాబుకు చిక్కుకున్నారని టీడీపీలోనే చర్చ మొదలైంది. బీజేపీతో పొత్తు టీడీపీలో మెజార్టీ నేతలకు ఇష్టం లేదనేది స్పష్టమవుతోంది. జగన్ ను ఓడించాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహకారం అవసరమని చంద్రబాబు భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ సైతం 2014 తరహా కూటమితోనే జగన్ ను ఓడించగలుగుతామని నమ్ముతున్నారు. అందులో భాగంగానే బీజేపీ వైఖరి తేల్చుకొనేందుకు ప్రయత్నాలు చేసారు. దాదాపు ఏడాదిన్నార కాలంగా బీజేపీ తమతో కలిసి వచ్చేలా పవన్ మంత్రాంగం చేసారు. తాజాగా ఢిల్లీ లో హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ తో ఇక ఎన్డీఏలో టీడీపీ చేరిక లాంఛనమనే ప్రచారం మొదలైంది. సీట్ల అంశం పైన అంచనాలు వ్యక్తం అయ్యాయి.

TDP-BJP Alliance leads to new Equations in AP Politics after CM Jagan meeting with PM Modi

పొత్తుల్లో కొత్త లెక్కలు : కానీ, ఇప్పుడు సీఎం జగన్ ను ఢిల్లీ ఆహ్వానించారు. ప్రధాని మోదీతో సీఎం జగన్ దాదాపు గంటన్నార సమావేశం అయ్యారు. దీని ద్వారా బీజేపీ ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటోందనే చర్చ మొదలైంది. టీడీపీ, జనసేనలో బీజేపీ తీరు పైన అనుమానాలు మొదలయ్యాయి. తమతో పొత్తుల చర్చలు చేస్తూ..జగన్ తో మంత్రాంగం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బీజేపీతో పొత్తు ఖాయం చేసుకున్నా... బీజేపీ - జగన్ మధ్య ఉన్న సత్సంబంధాలు తమ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే సందేహం టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. జనసేన తో సీట్ల విషయంలోనే ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఇక, బీజేపీతో పొత్తు తేలి..సీట్ల సర్దుబాటు ద్వారా పార్టీ భారీగా సీట్లను త్యాగం చేయాల్సి వస్తుందనే ఆందోళన పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది.

TDP-BJP Alliance leads to new Equations in AP Politics after CM Jagan meeting with PM Modi

ఏం జరుగుతోంది : బీజేపీ - టీడీపీ పొత్తు వ్యవహారం ఎప్పటి లోగా తేలుతుందనేది ఇంకా క్లారిటీ లేదు. బీజేపీ కోరిన సంఖ్యలో సీట్లు ఇవ్వటానికి చంద్రబాబు సిద్దంగా లేరు. ఆ సీట్లు రానప్పుడు బీజేపీ ముందుకు వస్తుందా లేదా అనేది మరో డౌట్. బీజేపీ ఒక వేళ పొత్తు సాధ్యం కాదని చెబితే పవన్ ఎవరి వైపు నిలుస్తారనేది ఎన్నికల్లో కీలకంగా మారనుంది. పవన్ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూనే టీడీపీతో మైత్రి కొనసాగిస్తున్నారు. ఇప్పడు బీజేపీ పొత్తు ఖాయం కావాలంటే ఆ పార్టీ అడుగుతున్న సీట్లు ఇవ్వాల్సి ఉంటుందని ఢిల్లీలోని నేతలు తేల్చి చెబుతున్నారు. జగన్ తో ప్రధాని మోదీ, అమిత్ షా దాదాపు గంట సేపు మంతనాలు చేయటం.. రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయనే సమాచారంతో టీడీపీ, జనసేన అలర్ట్ అయ్యాయి. దీంతో, పొత్తు వ్యవహారం ఎటు టర్న్ తీసుకుంటుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+