పవన్-రేణూ దేశాయ్ బంధం లాంటిదే బీజేపీ-టీడీపీ బంధం:జేసీ దివాకర్ రెడ్డి

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్ లా మరిన ఎంపి జెసి దివాకర్ రెడ్డి ప్రస్తుత టిడిపి-బిజెపి బంధంపై తన దైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనను బీజేపీ-టిడిపి అనుబంధం గురించి ప్రశ్నించగా జెసి ప్రస్తుతం తమ మధ్య ఉన్న బంధం పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్ మధ్య ఉన్నసంబంధం లాంటిదని చెప్పారు.

వారు విడాకులు తీసుకున్నప్పటికీ పిల్లల భవిష్యత్‌ కోసం అప్పుడప్పుడూ కలుస్తూ ఉంటారు...బీజేపీతో టీడీపీ అనుబంధం కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ప్రయోజనం కోసమే...అని చెప్పారు. అయితే మోదీకి పార్లమెంట్‌లో సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ ఏపీ పట్ల ఏమాత్రం కనికరం చూపించడం లేదని ఆయన అన్నారు.

TDP and BJP are like Pawan and Renu Desai now: JC Diwakar Reddy

ఏపీకి ప్రత్యేక హోదా విషయమై కేంద్రంతో టిడిపి విభేదించిన నేపథ్యంలో టిడిపి మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి తమ కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే తెలుగుదేశం పార్టీ ఇంకా ఎన్టీయేలో భాగస్వామిగానే కొనసాగుతుంది. అయినప్పటికీ గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం టీడీపీ, బీజేపీ మధ్య అసహజ వాతావరణమే ఉందని చెప్పుకోవాలి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
MP JC Diwakar Reddy, who is known for his controversial comments compared TDP and BJP’s current relation with Pawan and Renu Desai, in a recent interview given to a news channel. When the Reporter asked about TDP and BJP still continuing the relations, and discussions he told, even after divorce, husband and wife will have talk to each other on somethings for the sake of children’s future. In fact, many divorced couples openly tell that they talk to each other regarding children’s future.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి