ఆ ఐపీఎస్ డబుల్ గేమ్ - పదవి ఎలా ఇస్తారు..!!
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. అధికార యంత్రాంగ ప్రక్షాళన మొదలైంది. నాడు వైసీపీ ప్రభుత్వ హాయంలో ముఖ్య నేతల ప్రాపకం కోసం కొందరు ఐపీఎస్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు అదే అధికారులు కీలక పోస్టింగ్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో,అలాంటి అధికారులకు పోస్టింగ్ ఇవ్వద్దంటూ టీడీపీ కేడర్ డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు ఈ వ్యవహారం పార్టీలో చర్చనీయాంశంగా మారుతోంది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో పలువురు టీడీపీ ముఖ్య నేతల పై కేసులు నమోదయ్యాయి. జైలుకు పంపారు. అందులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉన్నారు. ఈఎస్ఐ స్కాం పేరుతో అచ్చెన్నాయుడును అరెస్టుచేసి కటకటాల్లోకి పంపించాలన్న కుట్రవెనుక ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి పేరు ప్రచారం లో ఉంది. పథకం వేయడం, అభియోగాలు మోపడం, అందులో లేనిపోనివి చొప్పించడం అన్నీ ఆ సీనియర్ అధికారి కనుసన్నల్లోనే సాగింది. ఆ సమయంలో పార్టీ అచ్చెన్నాయడుకు అండగా నిలిచింది.

అరెస్ట్ సమయంలో అచ్చెన్నాయుడు అనారోగ్యంతో ఉన్నారు. కోర్టు ఆదేశాలతో ఆయనకు ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. నాడు అచ్చెన్నాయుడు అరెస్ట్ వెనుక నాడు సీనియర్ అధికారి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రభుత్వంలో చొరబడేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ ఓటమికి తాను గట్టిగాపనిచేశానంటూ ప్రచారం చేసుకుని లాబీయింగ్ చేస్తున్నారు. టీడీపీ ముఖ్య నేత కోటరీతో సంప్రదింపులు చేస్తున్నట్టు పోలీసు వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఆ అధికారి గతంలో ఎలా వ్యవహరించారో టీడీపీ ముఖ్య నేతకు వివరించారు. దీంతో, ఆ అధికారికి సంబంధించిన పూర్తి సమాచారం ముఖ్య నేత ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఆ అధికారికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వద్దని ఆదేశించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications