టీడీపీలో 'మంగ్లీ' రచ్చ, మరో ట్విస్ట్ - స్పెషల్ ట్రీట్మెంట్..!!
తెలుగుదేశం పార్టీలో సింగర్ మంగ్లీ రచ్చ కొనసాగుతోంది. జగన్ కు మద్దతుగా వ్యవహరించిన మంగ్లీకి ఇప్పుడు టీడీపీ ముఖ్య నేతలే ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వటం టీడీపీ కేడర్ కు నచ్చటం లేదు. నేరుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు లక్ష్యంగా ప్రశ్నిస్తున్నారు. తన వ్యక్తిగత కార్యదర్శి నియామకంలోనూ రామ్మోహన్ నిర్ణయం కేడర్ కు ఆగ్రహం తెప్పించింది. కాగా, మంగ్లీ రచ్చ ఇప్పడు రామ్మోహన్ కు సమస్యగా మారుతోంది. సోషల్ మీడియా వేదికగా టీడీపీ కేడర్ ఇంకా పోస్టింగ్స్ కంటిన్యూ చేస్తున్నారు.
టీడీపీలో మంగ్లీ రచ్చ
ప్రముఖ సింగర్ మంగ్లీ గత ఎన్నికల సమయంలో మాజీ సీఎం జగన్ కు మద్దతుగా నిలిచారు. వైసీపీకి మద్దతుగా పాటలు పాడారు. ప్రచారం చేసారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తే భవిష్యత్ చల్లగా ఉంటుందని చెప్పుకొచ్చారు. మంగ్లీకి నాడు జగన్ ప్రభుత్వం టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఎస్వీబీసీ ఛానల్ కు సలహాదారుగా నియమించింది. ఎన్నికల సమయంలో టీడీపీ పాటలు పాడాలని ఆ పార్టీ నేతలు మంగ్లీని కోరారు. తన నోట చంద్రబాబు పేరు ఉచ్చరించటం ఇష్టం లేక ఆ ప్రతిపాదన విరమించినట్లు మంగ్లీ వెల్లడించారు. అయితే, ఇప్పుడు అలాంటి మంగ్లీకి అరసవల్లి ఆలయంలో రథసప్తమి నాడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రోటోకాల్ దర్శనం ఏర్పాటు చేయటం వివాదానికి కారణమైంది.

రామ్మోహన్ పై ఆగ్రహం
రథసప్తమి నాడు మంగ్లీతో ఆలయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఫొటోలు దిగారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన వెంట తీసుకెళ్లి మరీ దర్శనం చేయించటం పైన టీడీపీ కేడర్ కేంద్ర మంత్రిని నిలదీసింది. చంద్రబాబు పేరు ఉచ్చరించటానికి ఇష్టం లేని వైసీపీ మద్దతు దారుగా ఉన్న మంగ్లీకి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారని నిలదీసారు. ఇదే సమయంలో రామ్మోహన్ నాయుడు గతంలో తీసుకున్న మరో వివాదాస్పద నిర్ణయాన్ని పార్టీ కేడర్ ప్రశ్నిస్తోంది. టీడీపీ కేడర్ ను వేధించారనే విమర్శలు ఎదుర్కొన్న నాటి శ్రీకాకుళం కలెక్టర్ శ్రీకేశ్ బాలాజీని తన వ్యక్తిగత కార్యదర్శిగా రామ్మోహన్ నాయుడు నియమించుకోవటం కూడా పార్టీ కేడర్ కు రుచించటం లేదు.
వాట్ నెక్స్ట్
దీంతో, ఆ నిర్ణయం.. ఇప్పుడు మంగ్లీకి స్పెషల్ ప్రయార్టీ పైన టీడీపీ కేడర్ సీరియస్ అవుతోంది. పార్టీ కోసం పని చేసిన వారికి కాకుండా.. తమకు ఇబ్బంది పెట్టిన వారికి, వ్యతిరేకించిన వారికి ప్రాధాన్యత ఎలా ఇస్తారంటూ నిలదీస్తున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని పార్టీ అధి నాయకత్వాన్ని టీడీపీ కేడర్ కోరుతోంది. కాగా, ఈ వివాదం పైన ఇప్పటి వరకు రామ్మోహన్ నాయుడు, మంగ్లీ అధికారికంగా స్పందించలేదు.












Click it and Unblock the Notifications