మోడికి విశ్రాంతిని ఇస్తానన్న, చంద్రబాబే విశ్రాంతి తీసుకుంటున్నాడు : ప్రకాశ్ జవదేకర్

బీజేపీతో పోత్తువల్లే 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిందని కేంద్రమంంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఇక అలాంటీ నేతలు బీజేపీని విమర్శిస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి మోడీని శాశ్వతంగా విశ్రాంతి తీసుకునే విధంగా చేస్తామని చెప్పిన నాయకులు విదేశాల్లో తిరుగుతున్నారని చంద్రబాబును ఉద్దేశించి విమర్శలు చేశారు. తిరుపతిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వచ్చిన జవదేకర్ మీడియాతో మాట్లాడారు.

ఈనేపథ్యంలోనే ప్రధాని మోడిని ఓడించి దేశంలో చక్రం తిప్పుతామని చెప్పిన నేతలను ప్రజలు ఓడించి గుణపాఠం చెప్పారని టీడీపీని విమర్శిస్తూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ సంధర్భంగానే గత ఎన్నికల్లో బీజేపీ మద్దతు వల్లే తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని ,ఇక గత ఎన్నికల్లో చంద్రబాబు మోడీపై విమర్శలు చేయడంతోనే ప్రజలు బాబును తిరస్కరించారని అన్నారు.

TDP came to power in the 2014 elections with the BJP support: Prakash Javadekar

ఇలాంటీ పరిస్థితుల్లోనే ప్రతిపక్షాల బలం బయటపడిందని , కనీసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరో కూడ తెలియని పరిస్థితి నెలకోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంక్షోభంలో భాగంగానే కర్ణాటకలో ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+