Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీ పులివెందుల అభ్యర్ధి ఖరారు - జగన్ పై పోటీకి సిద్దం : ఆ చీలికపైనే ఆశలు..!!

2024 ఎన్నికలకు సంబంధించి పార్టీ నుంచి తొలి అభ్యర్ధిని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. సీఎం జగన్ సొంత నియోజకవర్గం అభ్యర్ధిని ఖరారు చేసారు. ఇప్పటి వరకు ఉన్న సందేహాలకు సమాధానం గా అక్కడ పార్టీ అభ్యర్ధి ఎవరో తేల్చేసారు. గత ఎన్నికల్లో జగన్‌పై ఇక్కడ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్సీ సతీశ్‌రెడ్డి.. ఎన్నికల అనంతరం వైసీపీ నేతలతో దగ్గరగా ఉంటున్నారు. ఆయన తిరిగి టీడీపీ వైపు వస్తున్నారంటూ ప్రచారం సాగుతోంది. దీంతో..పులివెందుల నియోకవర్గ నేతలతో టీడీపీ అధినేత సమావేశమయ్యారు.

పులివెందుల అభ్యర్ధి ఎవరంటే

పులివెందుల అభ్యర్ధి ఎవరంటే

పార్టీని వీడివెళ్లిన వారు తిరిగి వచ్చినా.. అక్కడ పోటీచేసేది ఎవరే అంశం పైన స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉంటూ..పులివెందుల టీడీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న బీటెక్ రవి..రానున్న ఎన్నికల్లో టీడీపీ పులివెందుల అభ్యర్దిగా తేల్చేసారు. వైఎస్సార్ సమయం నుంచి పులివెందులో టీడీపీ అభ్యర్ది గా సతీష్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు.

2019 ఎన్నికల్లో పులివెందులో జగన్ కు 1,32,356 ఓట్లు రాగా, టీడీపీ నుంచి పోటీ చేసిన సతీష్ రెడ్డికి 42,246 ఓట్లు వచ్చాయి. 90,110 ఓట్ల మెజార్టీతో జగన్ విజయం సాధించారు. ఇక, ముఖ్యమంత్రిగా తన సొంత నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు ప్రారంభించిన జగన్..ఖచ్చితంగా ఈ సారి అక్కడ నుంచే పోటీ చేయనున్నారు. దీంతో..టీడీపీ ముందుగానే అక్కడ బీ టెక్ రవిని అభ్యర్ధిగా ఖరారు చేసింది.

వైఎస్సార్ ఫ్యామిలీ అంశాలపైనే

వైఎస్సార్ ఫ్యామిలీ అంశాలపైనే

ఈ సమయంలోనే వైఎస్ వివేకా హత్య తరువాత వైఎస్సార్ ఫ్యామిలీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు తమకు అనుకూలంగా మారుతాయనే అంచనాలో టీడీపీ నేతలు ఉన్నారు. అదే విధంగా షర్మిల సైతం తన అన్న మాట కాదని తెలంగాణలో పార్టీ ఏర్పాటు..ఇప్పుడు కుటుంబంలో కనిపిస్తున్న గ్యాప్ వచ్చే ఎన్నికల్లో ఎంతో కొంత తమకు కలిసి వస్తుందని టీడీపీ లెక్కలు గడుతోంది.

ఇదే విషయాన్ని తాజాగా చంద్రబాబు సైతం పార్టీ నేతలకు వివరించారు. కుటుంబంలోని వారే వివేకాను హత్య చేశారని.. వారిని ముఖ్యమంత్రి రక్షిస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని పార్టీ నేతలతో చెప్పుకొచ్చారు. జగన్‌రెడ్డి ఇమేజ్‌ను, వైసీపీ ఇమేజ్‌ను ఈ పరిణామాలు బాగా దెబ్బ తీశాయని పులివెందుల టీడీపీ నేతలు ఈ సమావేశంలో వివరించారు.

సీఎం జగన్ కు కంచుకోటగా

సీఎం జగన్ కు కంచుకోటగా

మారిన పరిస్థితులను రాజకీయంగా పార్టీకి అనువుగా మార్చుకోవడానికి గట్టి ప్రయత్నం చేయాలని చంద్రబాబు సూచించారు. బీటెక్ రవి ఎమ్మెల్సీగా వైఎస్ వివేకా పైన గెలిచారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉన్నారు. కానీ, వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో..అందునా ఇప్పుడు సీఎం గా ఉన్న జగన్ పైన పోటీ చేయటం రాజకీయంగా పెద్ద సవాల్ గా మారనుంది. అటు వైసీపీ ముఖ్య నేతలు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం పైన టార్గెట్ చేసారు. వరుసగా జరిగిన పంచాయితీ.. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీని ఓడించారు.

2024 ఎన్నికలకు ఎంపిక మొదలు

2024 ఎన్నికలకు ఎంపిక మొదలు

నైతికంగా చంద్రబాబు పైన పై చేయి సాధించారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబును ఓడిస్తామని ధీమాగా చెబుతున్నారు. కుప్పం బాధ్యతలను పర్యవేక్షిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి నియెజకవర్గం పుంగనూరు పైన చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. ఈ సారి ఎన్నికల్లో పెద్దిరెడ్డిని ఓడిస్తానని కుప్పం లోనే చంద్రబాబు శపధం చేసారు. దీంతో..ఇప్పుడు కుప్పం..పులివెందుల నియోకవర్గాల్లో చోటు చేసుకొనే సమీకరణాలు రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+