విడదల రజనీకి షాక్ తప్పదా - ఎగ్జిల్ పోల్స్ తేల్చిందేంటి..!!
ఏపీలో ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇవే వాస్తవ ఫలితాలు కాకపోయినా..పబ్లిక్ మూడ్ పైన అంచనాలు కనిపిస్తున్నాయి. అయితే, పలు సర్వే సంస్థలు ఈ సారి ఏపీ ఎన్నికల ఫలితాల పైన ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి పెంచిన నియోజకవర్గాల్లో గుంటూరు పశ్చిమం ఒకటి. అక్కడ టీడీపీకి గెలుపు ఛాన్స్ ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.
మంత్రి రజనీ గెలవరంటూ
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి మంత్రి రజనీ పోటీ చేస్తున్నారు. జగన్ అభ్యర్దుల మార్పులో భాగంగా ప్రకటించిన తొలి జాబితాలోనే రజనీ పేరు ఖరారు చేసారు. నాలుగు నెలలుగా గుంటూరు పశ్చిమం లో రజనీ ప్రచారం చేసారు. టీడీపీ నుంచి ఆలస్యంగా అభ్యర్దిని ఖరారు చేసారు. అక్కడ టీడీపీ అభ్యర్దిగా గల్లా మాధవి బరిలో నిలిచారు. ఇద్దరి మధ్య హోరా హోరీగా పోరు జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు లో భాగంగా గుంటూరు పశ్చిమంలో ఓట్ బ్యాంక్ బలంగా కనిపించింది. అయితే, రజనీ సైతం గట్టి పోటీ ఇచ్చారు. పోలింగ్ సరళి పైన ఒక సమయంలో స్పష్టత రాలేదు.

గెలుపు పై రజనీ నమ్మకం
పోలింగ్ సరళి గమనించిన తరువాత వైసీపీ, టీడీపీ నుంచి ఎవరు గెలిచినా...స్వల్ప తేడా మాత్రమే ఉంటుందనే అంచనాలు కనిపించాయి. అయితే, ఎగ్జిట్ పోల్స్ లో గుంటూరు పశ్చిమం లో టైట్ ఫైట్ నెలకొందని అంచనా వేసారు. అదే సమయంలో ఆరా వంటి సంస్థలు గుంటూరు పశ్చిమంలో మంత్రి రజనీ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోతారని వెల్లడించారు. కానీ, ఈ అంచనాలతో రజనీ వర్గం విభేదిస్తోంది. తాము స్వల్ప మెజార్టీతో అయినా గెలుస్తామని నమ్మకం వ్యక్తం చేస్తోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ఆవిర్భావం తరువాత ఇప్పటి వరకు విజయం సాధించ లేదు.
ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యేనా
ఈ సారి టీడీపీకి కంచుకోటగా ఉన్న గుంటూరు పశ్చిమం లో ఈ సారి వైసీపీ జెండా ఎగురవేయాలని రజనీ పట్టుదలతో కనిపించారు. ముఖ్యమంత్రి జగన్ సైతం తన ఎన్నికల ప్రచార సభల్లో రజనీ సామర్ధ్యం గురించి ప్రశంసించారు. కానీ, నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఈ పోరులో టీడీపీ అభ్యర్దికి గెలుపు అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనాగా కనిపిస్తోంది. ఇప్పటికీ రజనీ వర్గం తుది ఫలితం తమకు సానుకూలంగా ఉంటుందనే నమ్మకంతో ఉన్నారు. దీంతో..4న వెల్లడయ్యే ఫలితంలో ఎవరిని విజయం వరిస్తుందనేది చూడాలి.












Click it and Unblock the Notifications