టీడీపీ, బీజేపీ పొత్తులో కొత్త ట్విస్ట్ - చంద్రబాబు ఒప్పుకున్నారా..!!

టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు ఖాయమేనా. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్. ఢిల్లీ కేంద్రంగా నాలుగున్నారేళ్ల తరువాత కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపైన చర్చించారు. 2014 తరహాలో మూడు పార్టీలు కలిసి వైసీపీని ఓడించాలనేది చంద్రబాబు లక్ష్యం. ఈ సమావేశంలో ఈ దిశగానే ప్రతిపాదనలు చేసారు. రెండు పార్టీల ప్రయోజనాలపై చర్చించారు. అక్కడే అసలు ట్విస్ట్.

ఎన్నికలు నవ్ ఆర్ నెవర్:వచ్చే ఎన్నికలు నవ్ ఆర్ నెవర్ అన్నట్లుగా చంద్రబాబు భావిస్తున్నారు. పార్టీ నేతలకు ఇదే స్పష్టం చేసారు. ఈ సమయంలో జగన్ ను ఓడించేందుకు అవసరమైనే ఒక అడుగు వెనక్కు వేసేందుకు సిద్దం అయ్యారు. అందులో భాగంగానే ఇటు పవన్..అటు బీజేపీకి స్నేహ హస్తం అందించారు. పవన్ తో పొత్తు దాదాపు ఖాయమైంది. బీజేపీతో ఢిల్లీ కేంద్రంగా చర్చలు జరిగాయి. ఆ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు పార్టీలు కలిస్తే కలిగే ప్రయోజనం గురించి చంద్రబాబు వివరించారని సమాచారం. కానీ, తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం అసలు టీడీపీతో పొత్తు వద్దంటే వద్దని హైకమాండ్ కు సూచిస్తున్నారు. ఇదే అంశం అమిత్ షా సమక్షంలోనే జేపీ నడ్డా టీడీపీ అధినేతతో వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ సమాచారం.

TDP Chef Chandra Babu meeting with Home Minister Amit Shah triggered speculation of the two parties reviving their alliance.

చర్చల్లో ఏం జరిగింది:బీజేపీకి ఇప్పుడు ఏపీ కంటే తెలంగాణనే ప్రాధాన్యత ఇస్తోంది. అక్కడ ఆ పార్టీ ఎదిగేందుకు ఇది సరైన అవకాశంగా భావిస్తోంది. ఈ సమయంలో హైదరాబాద్ సిటీ తో పాటుగా పొరుగు జిల్లాల్లో టీడీపీ బలం గురించి ఈ సమావేశంలో మరోసారి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో తాము సహకరించేందుకు సిద్దంగా ఉన్నామని..ఏపీలో బీజేపీ సహకరించాలని చంద్రబాబు ప్రతిపాదించారని సమాచారం. బీజేపీ - టీడీపీ పొత్తు ద్వారా బీఆర్ఎస్ పైన ప్రభావం గురించి ప్రాధమికంగా చర్చ చేసారని చెబుతున్నారు. ముందు తెలంగాణ గురించి ఆలోచన చేసి, ఆ తరువాత ఏపీ గురించి చూద్దామంటూ ఎక్కడా పొత్తు సంకేతాలు ఇవ్వలేదని విశ్వసనీయ సమాచారం. పొత్తు రెండు రాష్ట్రాల్లోనూ ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నారు.

డైలమాలో పొత్తు అంశం:తెలంగాణలో పొత్త బీజేపీకి అవసరం కాగా.. ఏపీలో పొత్తు టీడీపీకి అవసరం. గతంలో చోటు చేసుకున్న పరిణామాలు.. ఎన్నికల సమయంలో మరోసారి పొత్తు ద్వారా ప్రజల్లోకి వెళ్తే ఎటువంటి ఫలితం ఉంటుందనేది రెండు పార్టీల నాయకత్వాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ భేటీలో తెలంగాణ గురించి మాత్రమే పధానంగా చర్చ జరిగిందని.. ఏపీ విషయంలోనూ ఒక నిర్ణయానికి రావాలని చంద్రాబు కోరినట్లు తెలుస్తోంది. దీంతో, ఈ తరహా సమావేశాలు మరిన్ని జరిగిన తరువాతనే పూర్తి క్లారిటీ వస్తుందని ముఖ్య నేతల సమాచారం. దీని కారణంగానే రెండు వైపులా ఈ సమావేశం పైన ఎటువంటి ప్రకటన చేయలేదని చెబుతున్నారు. దీంతో మరి కొద్ది రోజులు టీడీపీ, బీజేపీ పొత్తు పైన డైలమా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+