టీడీపీ వర్సస్ జనసేన, ఆ సీటు ఎవరికి - అభ్యర్ధిని ఖరారు చేసిన చంద్రబాబు..!!
గోదావరి జిల్లాల్లో కొత్త రాజకీయం మొదలైంది. టీడీపీ..జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ రెండు పార్టీల ఆశావాహుల్లో టెన్షన్ మొదలైంది. వారాహి యాత్ర వేళ జనసేనాని పవన్ రాజానగరం నియోజకవర్గ పార్టీ ఇంఛార్జ్ ను ప్రకటించారు. ఇప్పుడు అదే నియోకవర్గంలో టీడీపీ అభ్యర్ధి దాదాపు ఖరారయ్యారు. దీంతో , రాజానగరం సీటు రెండు పార్టీల్లో దక్కేదెవరికి..అభ్యర్ధిగి నిలిచేదెవరనే ఉత్కంఠ రెండు పార్టీల నేతల్లోనూ కనిపిస్తోంది.
గోదావరి జిల్లాలపై పవన్:పవన్ కల్యాణ్ ఈ సారి గోదావరి జిల్లాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. వైసీపీకి అక్కడ ఒక్క సీటు రావటానికి వీళ్లేదని శపథం చేసారు. ఇదే సమయంలో మూడు నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జ్ లను నియమించారు. పిఠాపురానికి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజానగరం నియోజకవర్గం ఇంఛార్జ్ గా బత్తుల బలరామకృష్ణ నియమితులయ్యారు.

అదే సమయంలో కొవ్వూరు ఇంఛార్జ్ బాధ్యతలను మాజీ శాసన సభ్యుడు టీవీ రామారావుకు అప్పగించారు. టీడీపీ-జనసేన ఒప్పందంలో భాగంగా ఈ సీట్లు జనసేనకు వెళ్తాయనే చర్చ జిల్లాలో రెండు పార్టీల్లోనూ ఉంది. అందులో భాగంగానే పవన్ కల్యాణ్ ఈ నియామకాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమయంలొనే టీడీపీలో కీలక నిర్ణయం జరిగింది.
టీడీపీ ఇంఛార్జ్ నియామకం:రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా బొడ్డు వెంకటరమణ చౌదరి నియమితులయ్యారు.అమరావతిలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తాజాగా బొడ్డు వెంకటరమణచౌదరితోనూ, మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌తోనూ వేర్వేరుగా చర్చించారు. అనంతరం ఇద్దరితోనూ కలసి మాట్లాడారు.
వెంకటరమణ చౌదరిని అక్కడ ఇన్‌చార్జిగా నియమిస్తున్నామని కలిసి పనిచేయాలని సూచించారు. వెంకటేష్ గతంలో ఇక్కడ రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసారు. గతే డాది ఇన్‌చార్జి పదవికి రాజీనామా చేశారు.కానీ కొద్ది నెలల నుంచి మళ్లీ ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వచ్చే ఎన్నికలకు ఆయనే పార్టీ అభ్యర్ధి అవ్వటం ఖాయంగా కనిపిస్తోంది.

రెండు పార్టీల్లో ఉత్కంఠ:ఈ నియోజకవర్గంలో పార్టీ ఇటీవల కొంత బలహీన పడిందనే ప్రచా రం జరిగింది. వెంకటేష్‌కు వ్యతిరేకంగా కొందరు ఫిర్యాదులు కూ డా చేశారు. చివరకు అధి ష్ఠా నం ఆయనను తప్పించి బొడ్డు వెంకటరమణచౌదరినిఇన్‌చార్జిగా నియమించింది. వెంకటరమణ తండ్రి బొడ్డు భాస్కరరామారావు ఎమ్మెల్యేగా, టీడీపీలో కీలకగా నేతగా పనిచేశారు. 2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరడంతో వెంకటరమణ చౌదరి రాజమహేంద్రవరం నుంచి ఎంపీగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మాగంటి మురళీమోహన్ చేతిలో ఓటమి చెందారు. తర్వాత మళ్లీ టీడీపీలో చేరారు. ఇప్పుడు టీడీపీ, జనసేన నుంచి ఇద్దరు ఇంఛార్జ్ లు కొత్తగా నియమితులు కావటంతో..ఈ సీటు ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ కొనాగుతోంది.












Click it and Unblock the Notifications