నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రధాని మోదీ - నేను ఆ విషయంలో ఒక్కటే : జగన్ కు రిటర్న్ గిఫ్ట్ - చంద్రబాబు..!!

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రసంగాల్లో ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. కందుకూరు ఘటనపైన సీఎం చేసిన కామెంట్స్ ను చంద్రబాబు తిప్పి కొట్టారు. ఇరుకు రోడ్లలో డ్రోన్ షాట్స్ కోసం 8 మంది ప్రాణాలు తీసారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. దీనికి చంద్రబాబు స్పందించారు. ఇష్టమొచ్చినట్లు అవాకులు..చవాకులు పేలితే తరిమికొడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి నర్సీపట్నం సభలో చంద్రబాబు వయసును ప్రస్తావించారు.

దీనికి సమాధానం ఇచ్చిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రధాని మోదీని ప్రస్తావించారు. టీడీపీ అన్ స్టాపబుల్ అని..రాష్ట్రం కోసం దూసుకుపోతుందని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిని ఇంటికి పంపటానికి సిద్దంగా ఉన్నారా లేదా అంటూ సభకు హజరైన వారిని చంద్రబాబు ప్రశ్నించారు.

ప్రధాని మోదీ కూడా ..

ముఖ్యమంత్రి జగన్ పదే పదే తన వయసు గురించి మాట్లాడటం పైన చంద్రబాబు సీరియస్ అయ్యారు. నర్సీపట్నం సభలో 73 ఏళ్ల ముసలాయన అంటూ చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశంతో తన వయసు ఉన్న ముఖ్యమంత్రులు చాలా మంది ఉన్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో ప్రధాని మోదీ గురించి చంద్రబాబు ప్రస్తావించారు. ప్రధాని మోదీ కూడా తన వయసు వారనేని చెప్పుకొచ్చారు. తమ వలన ప్రజలకు ప్రమాదం లేదన్నారు. జగన్ లాంటి వారు ముఖ్యమంత్రులు అయితే ప్రమాదని వ్యాఖ్యానించారు.

14 ఏళ్లు ఏపీకి సీఎంగా ఉన్న తాను ఏనాడైనా ప్రజలను ఇబ్బంది పెట్టానా అని ప్రశ్నించారు. ప్రజల రక్షణ కోసం ప్రతిపక్షాలన్నీ ఒక్కటై ప్రజాహక్కుల పరిరక్షణకు కమిటీ ఏర్పాటు చేశాయన్నారు. జగన్ డిక్టేటర్ కాదంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.

జగన్ ఆస్తుల పైనా కీలక వ్యాఖ్యలు

జగన్ ఆస్తుల పైనా కీలక వ్యాఖ్యలు

దేశంలోని అందరు ముఖ్యమంత్రుల ఆస్థి రూ 317 కోట్లయితే, జగన్ ఒక్కరి ఆస్తే రూ 373 కోట్లని చంద్రబాబు వివరించారు.తండ్రి వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో ఎన్నికల అఫిడవిట్ లో లక్షల్లో ఆస్తులు చూపించారని. ఇప్పుడు జగన్ కు కోట్లాది రూపాయాలు ఎక్కడి నుంచి వచ్చాయని చంద్రబాబు ప్రశ్నించారు.

అటు ముఖ్యమంత్రి జగన్ బీసీ గర్జన ద్వారా వచ్చే ఎన్నికలకు బీసీలను ఓన్ చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో తన జిల్లాల పర్యటనల్లో చంద్రబాబు బీసీ వర్గాలకు చెందిన నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

టీడీపీ వెంటే బీసీలు.. బీసీల వెంటే టీడీపీ ఉంటుందని చెప్పుకొచ్చారు. బీసీల సాధికారత పైనే తొలి సంతకం ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. బీసీలు జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని వ్యాఖ్యానించారు.

సమయం లేదు మిత్రమా అంటూ..

చంద్రబాబు సభల్లో గతం కంటే భిన్నంగా తన ప్రసంగాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూనే..సభకు వచ్చిన వారి నుంచి సమాధానాలు రాబడుతున్నారు. అందులో భాగంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా లేదా అంటూ ప్రశ్నించారు. సమయం లేదు మిత్రమా అంటూ..ఉపేక్షిస్తే రాష్ట్రం నాశనం అవుతుందని వ్యాఖ్యానించారు.

తాను ముఖ్యమంత్రిని అయి ఉంటే మూడు వేల రూపాయాల పెన్షన్ ఇచ్చే వాడినని చంద్రబాబు చెప్పుకొచ్చారు. జగన్ అధికారంలోకి వస్తే మూడు వేల పెన్షన్ ఇస్తానని చెప్పి మోసం చేసారని ఆరోపించారు. తాను 55 లక్షల మందికి పెన్షన్ ఇస్తే 39 లక్షల మందికే ఇచ్చినట్లు అబద్దాలు చెబుతున్నారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావటం ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేసారు.

English summary
TDP Chief Chandra Babu Interesting comments on PM Modi age and his age, seriously reacted on CM Jagan Comments against him
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X