మనమేంటో చూపిస్తాం - ప్రధాని నిర్ణయం పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!!

టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. రాజమహేంద్రవరం వేదికగా జరుగుతున్న మహానాడు ద్వారా ఎన్నికల రణరంగంలోకి దిగాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం వచ్చే ఎన్నికల అజెండా పైన స్పష్టత ఇవ్వనున్నారు.

ఇదే సమయంలో సంక్షేమం అంశంలో సీఎం జగన్ ను ఢీ కొట్టేలా చంద్రబాబు కొత్త ఆలోచనలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మహానాడులో స్పష్టత ఇచ్చేలా చంద్రబాబు ప్రకటన ఉండనుంది. పార్టీ నేతలతో ప్రధాని గురించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు.

TDP Chief Chandra Babu made interesting comments on PM Modi, Polit buero accepts party resolutions

పోలిట్ బ్యూరో నిర్ణయాలు: పార్టీ మహానాడులో ఆమోదించాల్సిన తీర్మానాలపై పార్టీ పోలిట్ బ్యూరోలో చర్చించారు. సంక్షేమం గురించి వైసీపీ చేస్తున్న విమర్శలపైన చర్చకు వచ్చింది. ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తన వ్యూహాలపై సంకేతాలు ఇచ్చారు. టీడీపీకి మించి సంక్షేమం చేసిన పార్టీ రాష్ట్ర చరిత్రలో మరొకటి లేదన్నారు.

పేదలకు సంక్షేమ కార్యక్రమాలను మొదలు పెట్టిందే టీడీపీ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. పేదల సంక్షేమం జెండా.. అజెండా మనదేనని పార్టీ నేతలకు స్పష్టం చేసారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక్క దళితుల కోసమే 27 పథకాలను అమలు చేశాం. జగన్‌ వచ్చి మొత్తం రద్దు చేశారని విమర్శించారు. డు. ఏవో రెండు, మూడు పథకాలు చూపించి అదే సంక్షేమం అని ప్రచారం చేసుకుంటున్నాడని దుయ్యబట్టారు.

ప్రధాని నిర్ణయం సరైనదే: ప్రధాని మోదీ నూతన పార్లమెంట్ ను ప్రారంభించటం.. విపక్షాల నిరసనల పైన పోలిట్ బ్యూరో సమావేశంలో చర్చ జరిగింది. ఈ వివాదంపై చంద్రబాబు స్పందించారు. ఢిల్లీలో నూతన పార్లమెంట్‌ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించడంలో తప్పు పట్టాల్సింది ఏమీ లేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే సీఎం జగన్ ప్రధానికి మద్దతుగా ట్వీట్ చేసారు. పార్లమెంట్ ప్రారంభోత్సవానికి జగన్ హాజరవుతున్నారు. టీడీపీ నుంచి ఎంపీ కనకమేడల హాజరు కానున్నారు.

ఇక.. మళ్లీ చంద్రబాబు గెలిస్తే.. అమ్మ ఒడి, పింఛన్లు వంటి పథకాలు ఆగిపోతాయని సీఎం జగన్‌ చేస్తున్న దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని పార్టీ నేతలకు చంద్రబాబు నిర్ధేశించారు. లోకేశ్‌ చేస్తున్న యువగళం పాదయాత్రపైనా చర్చించారు. రాయలసీమలో కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో లోకేశ్‌ ఎలా అడుగుపెడతాడో చూస్తామని సవాళ్లు విసిరినా.. వాటికి వెరవకుండా లోకేశ్‌ ధైర్యంగా ముందుకు సాగుతున్నారని సభ్యులు ప్రశంసించారు.

TDP Chief Chandra Babu made interesting comments on PM Modi, Polit buero accepts party resolutions

ఎస్సీ వర్గీకరణపై చర్చ: ఈ సమావేశంలోనే వర్ల రామయ్య ప్రస్తావించారు. గతంలో టీడీపీ ఎస్సీలను వర్గీకరించి మాదిగలకు న్యాయం చేసిందని, ఇప్పుడు కూడా అదే వైఖరిని ప్రకటించాలని కోరారు. అయితే, మాల సామాజిక వర్గాన్ని కూడా దగ్గరకు తీసుకోవాల్సిన అవసరాన్ని పార్టీ గుర్తించాలని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు అన్నారు. చంద్రబాబు స్పందించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసిందని... కానీ, అది కోర్టు వివాదాల్లో చిక్కుకుంది.

మాదిగలకు న్యాయం చేసేందుకు టీడీపీ కట్టుబడి ఉందన్నారు. వారికి ప్రాధాన్యత ఇస్తూనే ఉప కులాలను కూడా కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. జిల్లాలను ప్రాతిపదికగా తీసుకుని, ఎక్కడ, ఎవరి జనాభా అధికంగా ఉంటే సంక్షేమ పథకాలు, సీట్ల విషయంలో ఆమేరకు వారికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచన ఉందని స్ఫష్టం చేసారు. దీనిపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుందామని పేర్కొన్నారు. పార్టీకి దన్నుగా నిలుస్తున్న బీసీలు,మాదిగలకు మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పటానికి ఒక కార్యాచరణను రూపొందించుకోవాలని సమావేశం నిర్ణయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+