Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైసీపీ నుంచి ఆ నలుగురే కాదు - జగన్ ఆలోచన ఇదే: చంద్రబాబు..!!

టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసీపీ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జగన్ నవంబరు లేదా డిసెంబరులో ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్‌కు, వైసీపీకి ఇవే చివరివి కావాలన్నారు. టీడీపీకి బలమైన సైన్యం ఉందని... దానిని తట్టుకోవడం ఎవరి తరం కాదన్నారు. చివరకు సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆ పార్టీకి ఓట్లు వేయలేదని ఎద్దేవా చేసారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని చంద్రబాబు జోస్యం చెప్పారు.

వరుస ఓటములతో ముఖ్యమంత్రి జగన్ కు భయం పట్టుకుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విజయం సాధించటానికి పార్టీ నేతలు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షం లో ఉన్న నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీ సంతలో పశువుల మాదిరిగా కొనలేదా.. ఇప్పుడు చెబుతున్న నీతులు అప్పుడేమయ్యాయని ప్రశ్నించారు.

తెలుగు దేశం పార్టీ గెలుపును ఇక ఎవరూ అడ్డుకోలేరని చెప్పుకొచ్చారు. టీడీపీ అన్ స్టాపబుల్..ఇంకా స్పీడ్ పెంచుతామని పేర్కొ్నారు. ఇటీవల పట్టభద్ర ఎన్నికల్లో గోదావరి జిల్లాలు, కృష్ణా గుంటూరు తప్ప మిగిలిన జిల్లాల వారు తమ తీర్పు ఇచ్చేశారు. ఇక్కడ ఎన్నికలు జరిగి ఉంటే ఆ తీర్పు ఇంకా రెట్టింపు స్థాయిలో ఉండేదన్నారు.

TDP Chief Chandra Babu predicts early poll in AP, confident on back to Power

టీడీపీది జన బలం. దాని ముందు ధన బలం ఆగలేదని చంద్రబాబు విశ్లేషించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ గాల్లో పల్టీలు కొట్టారని చంద్రబాబు ఎద్దేవా చేసారు. జగన్ ఎంతో కసరత్తు చేసినా..చివరకి బొక్క బోర్లా పడ్డారని చెప్పుకొచ్చారు.

నలుగురు ఎమ్మెల్యేలే తమ అసంతృప్తిని బయటపెట్టారని, బయటకు రాని ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారని తెలిపారు. నలుగురు ఎమ్మెల్యేలే తమ అసంతృప్తిని బయటపెట్టారని, బయటకు రాని ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారని తెలిపారు. వైసీపీ సేవాదళ్ అధ్యక్షుడే ఆ పార్టీలో ఉండలేకపోయారని, నమ్మకంగా ఉండే నేతలే జగన్‌ను వీడి వెళ్తున్నారని తెలిపారు. పులివెందులలో కూడా టీడీపీ జెండా ఎగిరిందన్నారు.

ప్రజావేదికను కూలగొట్టిన రోజే జగన్ వైఖరేంటో అర్ధమైందని చంద్రబాబు విమర్శించారు. మళ్లీ టీడీపీ గెలిచి ఉంటే ఈ రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో నిలిచేదన్నారు. ఈసారి కార్యకర్తలను ఆదుకోవడం నా బాధ్యతగా భావించి పనిచేస్తానని చెప్పుకొచ్చారు. ఈసారి పైరవీలు ఉండవన్నారు.

బాగా పనిచేసే వారికి పిలిచి పదవులు ఇస్తామని ప్రకటించారు. ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లాలని సూచించారు. వారి వినతులు తెలుసుకుని పంపాలన్నారు. వాటన్నింటినీ మేం రికార్డు చేసి..అధికారంలోకి వచ్చాక ఒక మంత్రిని పెట్టి అవన్నీ పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+