ముగియనున్న చంద్రబాబు రిమాండ్, నేడు న్యాయమూర్తి ఎదుట - ఉత్కంఠ..!!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు రిమాండ్ నేటితో ముగియనుంది. స్కిల్ స్కాంలో సీఐడీ అరెస్ట్ చేసిన చంద్రబాబు(Chandra Bbau)కు ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ ఈ రోజుతో ముగియనుంది. ఈ రోజు రాజమండ్రి జైలు నుంచి వీడియో కాన్ఫిరెన్స్ విధానంలో ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయస్థానం న్యామూర్తి ఎదుట హాజరు పరచనున్నారు. ఇటు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటీషన్ పైన ఈ రోజునే తీర్పు వెల్లడి కానుండటంతో ఉత్కంఠ కొనసాగుతోంది.

కీలక పరిణామాలు:ఈ రోజు చంద్రబాబు కేసుల వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. చంద్రబాబుకు ఈ నెల 10న ఏసీబీ కోర్టు(ACB Court) విధించిన రిమాండ్ నేటితో ముగియనుంది. దీంతో, రాజమండ్రి జైలు నుంచి విచారణ కోసం చంద్రబాబును వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా హాజరు పరచనున్నారు. రిమాండ్ పొడిగింపు అంశం పైన న్యాయమూర్తి నిర్ణయం తీసుకోనున్నారు.

TDP Chief Chandra Babu Remand Completes today, ACB Court to Trail by Video conference

ఇదే సమయంలో సీఐడీ స్కిల్ స్కాంలో చంద్రబాబును అయిదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది. ఈ పిటీషన్ పైన సీఐడీ(CID), చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలు పూర్తయ్యాయి. గురువారం తీర్పు వస్తుందని భావించినా, హైకోర్టులో క్వాష్ పిటీషన్ తీర్పు ఈ రోజు వెల్లడయ్యే అవకాశం ఉందనే న్యాయవాదుల సమాచారంతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పును ఈ రోజుకు వాయిదా వేసారు.

రిమాండ్ పొడిగిస్తారా:హైకోర్టులో చంద్రబాబు స్కిల్ స్కాం(Skill Scam)లో దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పైన వాదనలు పూర్తయ్యాయి. తీర్పు రిజర్వ్ చేసారు. ఈ రోజు తీర్పు వస్తుందని న్యాయవాదులు భావించారు. కానీ, హైకోర్టులో ఈ రోజు తీర్పు కేసుల జాబితాలో ఈ కేసు ప్రస్తావన లేదు. దీంతో, ఇప్పుడు చంద్రబాబును కస్టడీ పిటీషన్ పైన ఏసీబీ కోర్టు తీర్పు పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

క్వాష్ పిటీషన్(Squash Petition) తీర్పు ఈ రోజు లేదని ఖరారు కావటంతో ముందుగా నిర్ణయించిన సమయానికే ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించనున్నారు. దీని ద్వారా సీఐడీ కోరిన విధంగా చంద్రబాబును కస్టడీకి అనుమతిస్తారా లేదా అనే అంశం పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో నే చంద్రబాబు రిమాండ్ సమయం ముగించటంతో..కొనసాగింపు పైన న్యాయమూర్తి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

TDP Chief Chandra Babu Remand Completes today, ACB Court to Trail by Video conference

కస్టడీ పిటీషన్ పై తీర్పు:అటు చంద్రబాబు పైన పెండింగ్ కేసుల్లో సీఐడీ వరుసగా పీటీ వారెంట్లను దాఖలు చేస్తోంది. ఇదే సమయంలో వీటి పైన చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టు(AP High Court)లో బెయిల్ పిటీషన్లు దాఖలు చేసారు. వీటి పైన హైకోర్టులో వరుసగా విచారణ జరగనుంది. ఇటు సీఐడీ కస్టడీ పిటీషన్ పైన ఏసీబీ కోర్టు తీర్పు(ACB Court) తరువాత..

చంద్రబాబు బెయిల్ పిటషన్ పైనా వాదనలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే బెయిల్ పిటీషన్ దాఖలు చేసి ఉండటంతో..దీని పైన విచారణ జరిగితే కోర్టు ఎటువంటి నిర్ణయం వెలువరిస్తుందనేది మరో ఆసక్తి కర అంశం. దీంతో, మొత్తంగా ఈ రోజున ఏసీబీ కోర్టులో చంద్రబాబు రిమాండ్.. సీఐడీ కస్టడీ పైన నిర్ణయం వెలువడనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+