Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పెనమలూరు టీడీపీ అభ్యర్దిపై హైడ్రామా - కుప్పంతో లింకు, కొత్త ట్విస్ట్..!!

ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సీట్ల సర్దుబాటు ఇంకా పూర్తి కాలేదు. టీడీపీ, జనసేన పార్టీలు తమ తుది జాబితా ప్రకటించాల్సి ఉంది. పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించినట్ల సీట్ల పైన ఇంకా కసరత్తు పూర్తి కాలేదు. ఈ సమయంలోనే టీడీపీ పెండింగ్ సీట్లలో పెనమలూరు పైన అనేక పేర్లతో సర్వేలు జరిగాయి. కానీ, అభ్యర్ది ఖరారు కాలేదు. అయితే, చంద్రబాబు ఇక్కడ సీటు పై కొత్త ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.

టీడీపీ అభ్యర్ది ఎవరు : పెనమలూరు సీటు పైన ఇప్పుడు టీడీపీలో ఆసక్తి కర చర్చ సాగుతోంది. టీడీపీకి బలమైన నియోకజవర్గంగా పెనమలూరు ఉంది. 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ నేత పార్ధసారధి విజయం సాధించారు. ఇప్పుడు ఆయన టీడీపీలో చేరి నూజివీడు నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు పెనమలూరు టీడీపీ ఇంఛార్జ్ గా ఉన్న బోడే ప్రసాద్ కు సీటు లేదని చంద్రబాబు స్పష్టం చేసారు. అక్కడ చంద్రబాబు కుటుంబం మినహా ఎవరు పోటీ చేసినా తాను పోటీ చేస్తానని గతంలో ప్రసాద్ ప్రకటించారు. రెండు సార్లు చంద్రబాబును కలిసారు. అభ్యర్ది ప్రకటన చేసే వరకు వేచి చూడాలని నిర్ణయించారు. ఇదే సమయంలో చంద్రబాబు పలువురి పేర్లతో పెనమలూరులో సర్వేలు చేయిస్తున్నారు.

TDP Chief Chandra Babu to announce Penamaluru contesting candidate seek Surevy Reports

సీటు దక్కేదెవరికి : మైలవరంలో వసంతకు సీటు ఇస్తే దేవినేని ఉమా పేరు పెనమలూరుకు పరిశీలన చేస్తున్నారని ప్రచారం సాగింది. అయినా..స్థానికంగా ఉన్న సమీకరణాలతో అక్కడ మైనార్టీ అభ్యర్ది పేరు పైనా సర్వే చేయించారు. గుంటూరు జిల్లా నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేరు పరిశీలనలోకి వచ్చింది. తాజాగా దేవనేని బాజీ కోడలు పేరు మీద కొందరికి ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చాయి. కమ్మ కార్పోరేషన్ ఛైర్మన్ తుమ్మల చంద్రశేఖర్, ఘట్టమనేని ఆదిశేషగిరి రావు పేర్లను పరిశీలించారు. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. తొలి జాబితాలో 94, రెండో జాబితాలో 34 మంది పేర్లను ప్రకటించిన చంద్రబాబు...పొత్తుల్లో మిత్రపక్షాలకు మినహాయించినవి కాకుండా పెండింగ్ స్థానాలను ప్రకటించాల్సి ఉంది. అందులో పెనమలూరు పైన స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

TDP Chief Chandra Babu to announce Penamaluru contesting candidate seek Surevy Reports

చంద్రబాబు పోటీ చేస్తారా : అయితే, పెనమలూరు చర్చ సమయంలో టీడీపీలో ఆసక్తి కర చర్చ మొదలైంది. ఇక్కడ నుంచి చంద్రబాబు కుటుంబ సభ్యులు పోటీకి అవకాశం ఉందని కొద్ది రోజుల క్రితం పార్టీ ముఖ్యులు బోడే ప్రసాద్ కు సంకేతాలు ఇచ్చారు. అయితే, కుప్పంలో ఈ సారి చంద్రబాబును ఓడించేందుకు వైసీపీ పెద్ద ఎత్తున వ్యూహాలు అమలు చేస్తోంది. చంద్రబాబు రెండో స్థానంగా పెనమలూరు నుంచి పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అదే సమయంలో రెండో స్థానం నుంచి పోటీ చేస్తే కుప్పంలో ఓడుతారనే కారణంతోనే చంద్రబాబు మరో నియోజకవర్గం ఎంపిక చేసుకున్నారని వైసీపీ విమర్శించే అవకాశం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో, దీని పైన చంద్రబాబు తుది నిర్ణయం ప్రకటించలేదు. సర్వేల పేరుతో ప్రస్తుతానికి నిర్ణయం పెండింగ్ పెట్టారు. చంద్రబాబు పోటీ పైన స్పష్టత వచ్చిన తరువాతనే పెనమలూరు సీటు ప్రకటించే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+