చంద్రబాబు- లోకేష్ జనయాత్రలు: మహానాడుకు ఎన్టీఆర్ వారసులు : పాలిట్ బ్యూరో కీలక భేటీ..!!

టీడీపీ అధినేత చంద్రబాబు 2024 ఎన్నికల లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా.. ఇప్పటికే ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు. నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లను ఖరారు చేసి.. ముందు గానే అభ్యర్ధులను సిద్దం చేసే ప్రక్రియ ప్రారంభించారు. ఇక, ఈ సారి మహానాడు ద్వారా ఎన్నికల సమర శంఖం పూరించటానికి సిద్దం అవుతున్నారు. దీని కోసం ఈ ఏడాది మహానాడు ను మూడు రోజుల పాటు హైదరాబాద్ గండిపేటలో నిర్వహించాలని నిర్ణయించారు. మహానాడు నిర్వహణ.. అసెంబ్లీ సమావేశాలు...ఏపీ రాజకీయాల పైన కీలక నిర్ణయాల దిశగా టీడీపీ పాలిట్ బ్యూరో కీలక భేటీ జరగనుంది.

 అసెంబ్లీ సమావేశాలకు హాజరు పైనా

అసెంబ్లీ సమావేశాలకు హాజరు పైనా

అందులో ప్రధనాంగా.. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా.. వద్దా అనే అంశంపై ఈ మీటింగ్​లో చర్చించనున్నారు. తాను సీఎంగానే అసెంబ్లీకి వస్తానని ప్రకటించిన చంద్రబాబు గత అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. చంద్రబాబు లేకున్నా మిగిలిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యే అంశంపై భేటీలో నిర్ణయించనున్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలున్నందున అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని మెజార్టీ నేతలు అభిప్రాయపడుతుండగా.. అసెంబ్లీకి వెళ్లినా సమస్యలను ప్రస్తావించే అవకాశం వైకాపా ఇవ్వదని పలువురు నేతలు అంటున్నారు.

మహానాడు ద్వారా ఎన్నికల శంఖారావం

మహానాడు ద్వారా ఎన్నికల శంఖారావం

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు భవిష్యత్ కార్యాచరణపై పొలిట్ బ్యూరో సమీక్షించనుంది. వైఎస్ వివేకా హత్య కేసులో జరుగుతున్న పరిణామాలతో సీఎం జగన్ శిబిరం ఆత్మరక్షణలో పడిందనే అభిప్రాయం టీడీపీ వ్యక్తం చేస్తోంది. ఇక, మహానాడుతో పాటుగా ప్రస్తుతం ఎన్టీఆర్ శత జయంతి కావటంతో వేడుకల నిర్వహణ.. పార్టీ ఆవిర్భావ వేడుకలపైన సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లు మహానాడు నిర్వహించలేదు. జూమ సమావేశాలకే పరిమితం అయ్యాయి. ఈ సారి అట్టహాసంగా మహానాడు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం ఈ నెలలోనే పార్టీ సభ్యత్వం.. శత జయంతి వేడుకలతో పాటుగా.. మహానాడుకు నందమూరి కుటుంబం మొత్తాన్ని ఒకే వేదిక మీదకు తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది.

నందమూరి కుటుంబం మొత్తం ఒకే వేదికపైకి

నందమూరి కుటుంబం మొత్తం ఒకే వేదికపైకి

విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు..నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు ద్వారా చంద్రబాబు టీడీపీ .. ఎన్టీఆర్ టీడీపీ అన్నట్లుగా ప్రచారం చేయటానికి వైసీపీ ప్రయత్నాలు చేస్తోందనేది టీడీపీ నేతల వాదన.
ఈ సమయంలో నందమూరి కుటుంబం సైతం టీడీపీ వేదిక మీదకు వస్తే..ఒక స్పష్టమైన సందేశం ఇచ్చినట్లుగా ఉంటుందని..ఎన్టీఆర్ శతజయంతి వేదికగా ఈ ప్రయత్నం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య..జూ ఎన్టీఆర్ తో సహా నందమూరి ఫ్యామిలీ మొత్తం హాజరు అయ్యేలా చూడాలనేది ఆలోచనగా సమాచారం.

Recommended Video

    Telangana TDP President Bakkani Narasimhulu Dharna Against TRS Govt
    ఎన్నికల యాత్రల పైనా

    ఎన్నికల యాత్రల పైనా


    ఇక, ఏపీలోనూ ముందస్తు ఎన్నికల ప్రచారం సాగుతున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. లోకేష్ ప్రజాయాత్రలకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు బస్ యాత్ర చేస్తారని చెబుతున్నార. అదే విధంగా లోకేష్ ఇక, ప్రజల్లోనే ఉండేలా పాదయాత్ర లేదా.. సైకిల్ యాత్ర చేస్తారని పార్టీలో ప్రచారం కొనసాగుతోంది. వీటి పైన పాలిట్ బ్యూరో సమావేశంలో చర్చించి.. ఎప్పటి మహానాడు తరువాత దీనికి కార్యాచరణ సిద్దం చేసే అవకాశం ఉంది. దీంతో..ఈ సారి జరిగే టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశం కీలక నిర్ణయాలకు వేదిక కానుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+