పవన్ కల్యాణ్‌కు షాక్.. మరో అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనకు మరోసారి షాకిచ్చారు. పవన్ కల్యాణ్‌ను సంప్రదించకుండానే మరో నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించారాయన. పొత్తు ధర్మం పాటించకుండా రాజానగరం, రాజోలు స్థానాల్లో అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్..పొత్తులో తన తమను సంప్రదించకుండా ఎలా అభ్యర్థులను ప్రకటిస్తారంటూ చంద్రబాబుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కూడా సీట్లపై చాలా ఒత్తిళ్లు ఉన్నాయి.
తప్పనిసరి పరిస్థితుల్లో..రాజానగరం, రాజోలు స్థానాల్లో ప్రకటిస్తున్నామంటూ జనసేన అభ్యర్థులను ప్రకటించి చంద్రబాబుకు గట్టి షాకే ఇచ్చారు. దీంతో టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందా విచ్ఛిన్నం అవుతుందా అనే అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. సీట్ల సర్దుబాటు విషయంలో చాలా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు.

ఈ ఘటన మరువక ముందే టీడీపీ అధినేత చంద్రబాబు మరో నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. తాజాగా ఆయన నూజివీడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిని ఖారారు చేశారు. మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొలుసు పార్థసారథికి నూజివీడు టికెట్ ఖారారు చేస్తే చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గం నుంచి కొలుసు పార్థసారథి వైసీపీ తరుఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

అయితే రాబోవు ఎన్నికల్లో వైసీపీ టికెట్ నిరాకరించడంతో కొలుసు పార్థసారథి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల గుడివాడలో నిర్వహించిన సభలోనే ఆయన టీడీపీలో చేరతారని భావించారు. కానీ టికెట్‌పై హామీ దక్కకపోవడంతో పార్థసారథి చేరిక వాయిదా పడింది. పెనమలూరులో బోడే ప్రసాద్ టీడీపీ ఇంచార్జ్‌గా కొనసాగుతున్నారు.

ఆయన్ను కాదని పెనమలూరు టికెట్ ఇవ్వడం సాధ్యం కాదని పార్థసారథికి తేల్చి చెప్పిన చంద్రబాబు.. తాజాగా ఆయనకు నూజివీడు టికెట్ కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 1న చంద్రబాబు సమక్షంలో కొలుసు పార్థసారథి టీడీపీలో చేరతారని సమాచారం. ఇప్పటికే టీడీపీ-జనసేన పొత్తులో టికెట్ల వివాదం సాగుతున్న తరుణంలో చంద్రబాబు నూజివీడు టికెట్‌ను ఏకపక్షంగా ప్రకటించడంపై జనసేన ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications