Chandrababu : ఏపీకి వచ్చి చూడండి- ఓట్ల తొలగింపుపై ఈసీని కోరిన చంద్రబాబు..
ఏపీలో అక్రమంగా భారీ ఎత్తున విపక్షాల సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్న వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఇవాళ సీఈసీతో దాదాపు గంటసేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో సాగుతున్న ఓట్ల తొలగింపు తంతును వివరించారు. దీనిపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో అక్రమ ఓట్ల తొలగింపుకు సంబంధించిన ఆధారాల్ని కూడా ఆయనకు అందజేశారు.
రాష్ట్రంలో ఎప్పుడూ లేని ఓ వింత సమస్య వచ్చిందని సీఈసీని కలిసిన అనంతరం చంద్రబాబు వ్యాఖ్యానించారు. విపక్షాల ఓట్లను భారీ ఎత్తున తొలగిస్తున్నారని, ఫిర్యాదు చేసినా రాష్ట్ర ఈసీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీనిపై కోర్టులకు కూడా వెళ్లామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం అసలు ఓట్లు తొలగించి, భారీగా నకిలీ ఓట్లు నమోదు చేశారని, గతంలో తమ ప్రభుత్వాల హయాంలో ఎప్పుడూ ఇలాంటి చెత్త పనులు చేయలేదన్నారు.

రాష్ట్రంలో అక్రమ ఓట్ల తొలగింపులపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వచ్చినట్లు చంద్రబాబు తెలిపారు. ఈసీకి అన్ని ఆధారాలు సమర్పించామన్నారు. తాము ఇచ్చిన ఆధారాలు సరైనవా లేక వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదులో ఆధారాలు సరైనవా తేల్చాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఓటర్ల డేటాను వాలంటీర్లు తీసుకోవడంపైనా చంద్రబాబు అభ్యంతరం తెలిపారు. ఓట్ల అక్రమాలు పరిశీలించేందుకు ఈసీ అధికారులు రాష్ట్రంలో పర్యటించాలన్నారు. అలాగే ఓ కమిటీ వేసి వీటిపై దర్యాప్తు చేయాలన్నారు. ఎన్నికలకు ముందే ఈ పని పూర్తి చేయాలన్నారు.
#WATCH | Delhi: "All three members with senior officers were present there. I gave clear presentations on how the Andhra Pradesh government is violating the election process and how they are destroying the system of democracy. Now, they want to destabilise the political… pic.twitter.com/KVwOKxf80x
— ANI (@ANI) August 28, 2023
మరోవైపు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అక్రమంగా ఓట్లు తొలగించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని టీడీపీ నేతలు పలుమార్లు కలిశారు. అలాగే హైకోర్టులోనూ పలు కేసులు దాఖలు చేశారు. ఇప్పుడు సీఈసీని ఫిర్యాదు చేయడం ద్వారా మరింత ఒత్తిడి పెంచాలనేది టీడీపీ ఉద్దేశంగా కనిపిస్తోంది. మరోవైపు వైసీపీ ఎంపీలు కూడా ఇవాళ సీఈసీని కలిసి రాష్ట్రంలో గత టీడీపీ హయాంలో తొలగించిన ఓట్లపై ఫిర్యాదు చేస్తున్నారు.
#WATCH | TDP chief and former Andhra Pradesh CM N Chandrababu Naidu arrives at the Election Commission office, in Delhi pic.twitter.com/So7XUKKRHS
— ANI (@ANI) August 28, 2023












Click it and Unblock the Notifications