తెలుగుదేశం నేతకు ఊహించని షాక్ ఇచ్చిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మరోసారి నియోజకవర్గాల సమీక్షను మొదలుపెట్టారు. ప్రతిరోజు ఒక నియోజకవర్గం చొప్పున సమీక్ష చేస్తూ అవసరమై మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా నిర్ణయాలు ఉండనున్నాయి. పనిచేయనివారిని, యాక్టివ్ గా లేనివారిని, ప్రత్యర్థి పార్టీలతో రాజీపడిన నాయకులను తప్పించేస్తున్నారు.
పార్వతీపురం నియోజకవర్గం నుంచే చంద్రబాబు ప్రక్షాళన మొదలుపెట్టారు. ఈ నియోజకవర్గానికి పార్టీ ఇన్ ఛార్జిగా బోనెల విజయచంద్రను నియమించారు. మొన్నటివరకు మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు ఇన్ చార్జిగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో పార్వతీపురం నుంచి చిరంజీవులు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో జోగారావు చేతిలో ఓటమిపాలయ్యారు.

చిరంజీవుల్ని తప్పిస్తూ విజయచంద్రకు బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వలు జారీచేశారు. నాయకులు కొందరు చిరంజీవులు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన్ను తప్పించడానికి ఇది కూడా ఒక కారణం. బీటెక్ పూర్తిచేసిన తర్వాత కార్పొరేట్ కంపెనీల్లో పనిచేశారు. తర్వాత వ్యాపారాన్ని ప్రారంభించారు. చిన్నతనం నుంచి టీడీపీ అంటే ఎంతో ఇష్టమని, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషిచేస్తానన్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకమైనవని, కచ్చితంగా విజయం సాధించి అధికారంలోకి రావాల్సిందేనని చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. పనితీరు బాగోని నాయకులను తప్పిస్తానని చెబుతూ వస్తున్నారు. గతంలోలా మొహమాటం కోసం టికెట్లు ఇచ్చి టీడీపీని ఇబ్బందులపాలు చేయడం తనక ఇష్టంలేదని, సీనియర్ నాయకులు, జూనియర్ నాయకులు అని తేడా లేకుండా కేవలం వారి పనితీరు ప్రాతిపదికనే టికెట్లు కేటాయించడం జరుగుతుందని బాబు స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications