గన్నవరం టీడీపీ అభ్యర్థి ఖరారు..పార్టీలో చేరక ముందే యార్లగడ్డకు షాక్..?
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అన్ని పార్టీలోనూ ఎన్నికల వాతవరణమే కనిపిస్తుంది. గెలుపుపై అన్ని రాజకీయ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.ప్రస్తుతం ఏపీ రాజకీయం అంతా కూడా గన్నవరం నియోజకవర్గం చూట్టునే తిరుగుతుంది. అధికార ,ప్రతిపక్ష పార్టీలకు గన్నవరం నియోజకవర్గం స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. ఇటీవల గన్నవరం నియోజకవర్గంలో జరిగినన్ని రాజకీయాలు మరే నియోజకవర్గం జరిగింది లేదు.
2019 ఎన్నికల్లో టీడీపీ గుర్తు మీద గెలిచిన వల్లభనేని వంశీ.. తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో అధికార వైసీపీ గూటికి చేరి.. ఆ పార్టీకి అండగా నిలిచారు. అయితే 2019 ఎన్నికల్లో వంశీ చేతిలో ఓడిపోయిన యార్లగ డ్డ వెంకట్రావు ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. వంశీతో కలిసి పని చేసే ప్రసక్తే లేదని పలు సందర్భాల్లో తేల్చి చెప్పిన యార్లగడ్డ ..ఇటీవలే వైసీపీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కడానికి రెడీ అయ్యారు.

ఈ నెల 22న నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరడానికి యార్లగడ్డ వెంకట్రావు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే యార్లగడ్డ టీడీపీలో చేరిన టికెట్ దక్కడం కష్టంగానే కనిపిస్తుంది. ఒకప్పుడు గన్నవరం టీడీపీకి కంచుకోటగా ఉండేది. 2014,2019 వరుస ఎన్నికల్లో అక్కడ నుంచి టీడీపీ తరుఫున వల్లభనేని వంశీ ఘన విజయం సాధించారు. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో కూడా ఆయన విజయం సాధించారు.

వంశీ గన్నవరంకు వచ్చిన తరువాత.. పార్టీ ఇమేజ్ కన్నా ఆయన వ్యక్తిగత ఇమేజ్‌ను ఎక్కువుగా బిల్డ్ చేసుకున్నారు. తాను ఏ పార్టీ తరుఫున పోటీ చేసిన విజయం సాధిస్తాననే ధీమాతోనే వంశీ వైసీపీలోకి వెళ్లినట్టుగా కనిపిస్తున్నారు. ఇదే సమయంలో వంశీని ఎదుర్కొవడం యార్లగడ్డ వల్ల కాదని టీడీపీ నాయకులే చెప్పడం సంచలనంగా మారింది. అంగబలం, ఆర్థిక బలం రెండింటిల్లోనూ యార్లగడ్డ కంటే వంశీ పైచేయిలో ఉన్నారని..పైగా వంశీ చేతిలో ఓడిపోయిన యార్లగడ్డకు టికెట్ ఇస్తే..గెలవడం కష్టమే అనే మాట గన్నవరం టీడీపీలో వినిపిస్తున్నాయివంశీని ఎదుర్కొవాలంటే బలమైన అభ్యర్థి అవసరం అని పార్టీ అధినేతకు టీడీపీ నాయకులు సూచిస్తున్నారు.

ఇదిలా ఉంటే గతంలో గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ..గద్దె రామ్మోహన్ రావు భార్య గద్దె అనురాధను ఈసారి.. గన్నవరం బరిలో దించాలని టీడీపీ అధినేత ఆలోచిస్తున్నారు. గద్దె రామ్మోహన్ రావు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాధినిత్యం వహిస్తున్నారు. ఆయన భార్య అనురాధను వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేయించాలని పార్టీ అధినేత ఆలోచిస్తున్నారు. పైగా గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం గద్దెకు ఎలాగూ ఉంది.

గద్దె ఫ్యామిలీ అయితేనే గన్నవరంలో విజయం సాధిస్తుందనే లెక్కలు వేసుకుంటున్నారు. వంశీని తట్టుకోవడం ఒక్క గద్దె రామ్మోహన్ రావు వల్లే అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే మొదటి ఛాయిస్‌గా గద్దె రామ్మోహన్ రావు , భార్య అనురాధాను లైన్లో పెట్టారని తెలుస్తుంది. ఒకవేళ గద్దె పోటీకి సముఖత వ్యక్తం చేయకపోతే..మరో ఆప్షన్‌గా ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ కుమారుడిని టీడీపీ తరుఫున బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి గన్నవరం టికెట్ దక్కేలా ఉంది. వీరిని కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన యార్లగడ్డకు టికెట్ దక్కడం కష్టమే అని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. గన్నవరం టికెట్ గురించి అతి కొద్ది రోజుల్లోనే టీడీపీ అధినేత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. టీడీపీలో చేరితే అయినా టికెట్ లభిస్తుందని యార్లగడ్డ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఒకవేళ గన్నవరం టిక్కెట్ దక్కకపోతే యార్లగడ్డ ఏం చేస్తారో చూడాల్సి ఉంది. టికెట్ దక్కకపోయినా తన రాజకీయ ప్రత్యర్థి వంశీ ఓటమికి యార్లగడ్డ పనిచేస్తారేమో చూడాలి.












Click it and Unblock the Notifications