వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Chandrababu Naidu: ప్రెస్ మీట్లో ఏడ్చేసిన చంద్రబాబు-అసెంబ్లీలో అవమానంపై ఆవేదన-గతాన్ని గుర్తుచేస్తూ కన్నీరు..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కుప్పంలో చంద్రబాబు టీడీపీని గెలిపించుకోవడంలో విఫలం కావడంతో అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఆడుకుంటోంది. ఇవాళ చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టగానే వైసీపీ సభ్యులు,మంత్రులు చంద్రబాబును టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో అవమానానికి గురైన చంద్రబాబు అసెంబ్లీని బహిష్కరించి వెళ్లిపోయారు. సీఎం అయ్యాకే తిరిగి అడుగుపెడతానన్నారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన చంద్రబాబు అక్కడా కన్నీరుమున్నీరయ్యారు.

Recommended Video

Chandrababu Crying ప్రెస్ మీట్లోనే ఏడ్చేసిన చంద్రబాబు CBN Challenge In AP Assembly | Oneindia Telugu

చంద్రబాబుకు అసెంబ్లీ బాయ్ కాట్

నలభయ్యేళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇవాళ అసెంబ్లీలో తీరని అవమానం జరిగింది. కుప్పంలో తాజాగా జరిగిన మున్సిపల్ పోరులో టీడీపీ ఓటమిపాలవ్వడంతో ఇక చంద్రబాబు పనైపోయిుందని ప్రచారం చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇవాళ అసెంబ్లీలో రెచ్చిపోయారు. చంద్రబాబును టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలకు దిగారు. ఓ దశలో మంత్రి కొడాలి నాని లుచ్చా అంటూ చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతే కాదు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పేరు ప్రస్తావిస్తూ విమర్శలకు దిగారు. దీంతో చంద్రబాబుకు తీవ్ర అవమానం తప్పలేదు. దీంతో చంద్రబాబు అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు.

 ప్రెస్ మీట్లో చంద్రబాబు కన్నీరుమున్నీరు

ప్రెస్ మీట్లో చంద్రబాబు కన్నీరుమున్నీరు

అనంతరం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు. అందులో ఆయన కన్నీరుమున్నీరయ్యారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాల్ని తల్చుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో వైసీపీ తీరు చాలా దారుణంగా ఉందని చంద్రబాబు తెలిపారు. తాను ఎంతో సంయమనంగా ఉన్నా సీఎం జగన్ తనను పదే పదే రెచ్చగొట్టారని చంద్రబాబు తెలిపారు. అయినా తాను వ్యక్తిగత విమర్శల్ని కూడా పట్టించుకోలేదన్నారు. అయినా ఇవాళ తన భార్య పేరును ప్రస్తావిస్తూ అవమానించారని, దీంతో తాను తట్టుకోలేకపోయానన్నారు. ఆ విషయం చెప్తూ ప్రెస్ మీట్లోనే చంద్రబాబు ఏడ్చేశారు. దీంతో అక్కడున్నవారంతా షాక్ కు గురయ్యారు.

ఇన్ని అవమానాల్లేవన్న చంద్రబాబు

ఇన్ని అవమానాల్లేవన్న చంద్రబాబు

తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నడూ ఇన్ని అవమానాల్ని ఎదుర్కోలేదని, రెండున్నరేళ్లుగా ఎన్నో బూతులు తిడుతూ అవమానాలు చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న బీఏసీ సమావేశానికి వెళ్లిన అచ్చెన్నాయుడును సీఎం జగన్ చంద్రబాబును చూడాలని ఉందని అన్నా భరించామన్నారు. ఇవాళ అసెంబ్లీలో తన భార్యను కూడా ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేశారని చంద్రబాబు అన్నారు. తాను ఎనిమిదోసారి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నానని, ఎంతో మంది సీనియర్ నేతలతో కలిసి పనిచేశానని గుర్తుచేశారు. విమర్శలు, ప్రతివిమర్శలు, గెలుపోటములు ఎదుర్కొన్నానని, గెలిచిప్పుడు పొంగిపోలేదని, ఓడినప్పుడు కుంగిపోయింది లేదన్నారు.

విపక్షాల్ని ఎప్పుడూ అవమానించలేదు

విపక్షాల్ని ఎప్పుడూ అవమానించలేదు

విపక్షంలో ఉన్నవారిని తానెప్పుడూ అవమానించలేదని చంద్రబాబు గుర్తుచేశారు. గతంలో ఎన్టీఆర్ ఆధ్వర్యంలో నేషనల్ ఫ్రంట్ పెట్టినప్పుడు సైతం కరుణానిధి, బిజూపట్నాయక్, జ్యోతిబసు వంటి ఎందరో జాతీయ నేతలతో పనిచేశానన్నారు. ప్రజల కోసం చేసేదే రాజకీయమని భావించానన్నారు. తన హయాంలో అమరావతి, పోలవరం చేపట్టినప్పుడు, కియా మోటార్స్ వచ్చినప్పుడు గర్వంగా ఫీలైనట్లు తెలిపారు. మలేషియా, సింగపూర్ మంత్రులు ఇక్కడికి వచ్చారన్నారు. ఎందరో కార్పోరేట్ దిగ్గజాలతో కలిసి పనిచేసిన చరిత్ర తనకుందన్నారు. కేంద్రంలో గతంలో ప్రధానిగా ఉన్న వాజ్ పేయ్ అడిగినా తాము మంత్రి పదవులు తీసుకోలేదన్నారు.

భార్యపై వ్యాఖ్యలు బాధించాయంటూ కన్నీరు

భార్యపై వ్యాఖ్యలు బాధించాయంటూ కన్నీరు


తన భార్య ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. అలాంటి వ్యక్తిపై వైసీపీ వ్యాఖ్యల విమర్శలు బాధించాయని చెబుతూ చంద్రబాబు కన్నీరుమున్నీరయ్యారు. ఐదారు నిమిషాల పాటు ప్రెస్ మీట్లో మాట్లాడకుండా ఆగిపోయారు. భువనేశ్వరికి రాజకీయాలపై ఎప్పుడూ ఆసక్తి లేదన్నారు. ఇప్పటికీ 40 ఏళ్ల తర్వాత కూడా తన తండ్రి సీఎంగా పనిచేసినా, భర్త సీఎంగా సుదీర్ఘకాలం పనిచేసినా ఎప్పుడూ ప్రోటోకాల్ ఉల్లంఘించలేదన్నారు. ఇప్పటికీ భువనేశ్వరికి తమ పార్టీ నేతలు చాలా మంది తెలియదన్నారు. తన పని, వ్యక్తిగత జీవితం, తనను ప్రోత్సహించడం తప్ప మరో విషయం తెలియని వ్యక్తి అని చంద్రబాబు అన్నారు. అలాంటి వ్యక్తిని సైతం వ్యక్తిత్వ హననానికి వచ్చారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

చరిత్రను గుర్తు చేసిన చంద్రబాబు

చరిత్రను గుర్తు చేసిన చంద్రబాబు


గతంలో నిండుసభలో ద్రౌపదిని అవమానించిన కౌరవులు ఏమయ్యారో అందరికీ తెలుసని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.
రామాయణంలో రాక్షసులు ఏం చేశారో కూడా చూశామన్నారు. దేవతల దగ్గర భస్మాసురుడు వరం తీసుకుని కోరితే ఈశ్వరుడు విష్ణువుని వేడుకుని బయటపడ్డాడని గుర్తుచేశారు. దేవతల దగ్గర వరాలు తీసుకుని ఇబ్బందులు పడిన వారున్నారని, ఇప్పుడు ప్రజల దగ్గర ఓట్లేయించుకుని జనాన్ని వైసీపీ ఇబ్బందులు పెడుతోందని చంద్రబాబు విమర్శించారు. తాను గతంలో ప్రజల కోసమే పనిచేశానని తెలిపారు. రాక్షస పాలనను మించి ప్రజలపై వైసీపీ భస్మాసుర హస్తం పెడుతోందన్నారు. అయినా తాము రాజీలేని పోరాటం చేశామన్నారు.

గౌరవసభ కాస్తా కౌరవసభగా మారిందంటూ

గౌరవసభ కాస్తా కౌరవసభగా మారిందంటూ


గతంలోనూ అసెంబ్లీలో విమర్శలు, ప్రతివిమర్శలు ఉన్నాయని, కానీ వైసీపీ మాత్రం గౌరవ సభను కౌరవసభగా మార్చేసిందని చంద్రబాబు ఆక్షేపించారు. గతంలో జగన్ తండ్రి వైఎస్ తన తల్లిపై విమర్శలు చేసినప్పుడు అంతా చెబితే క్షమాణపలు చెప్పారని గుర్తుచేసారు. తాను మూడుసార్లు సీఎంగా పనిచేశానని, పలుమార్లు ప్రతిపక్షనేతగా ఉన్నానని, కానీ ఇప్పుడు తన భార్యను అవమానిస్తున్నారని స్పీకర్ కు చెప్పి మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని కోరగా... స్పీకర్ స్పందించలేదన్నారు. ఎన్టీఆర్ వంటి వారు సభలో తనకు అవమానం జరిగితే అక్కడే చెప్పి బయటికి వచ్చారన్నారు. కానీ తనకు జరిగిన అవమానంపై తప్పని చెప్పకుండా స్పీకర్ వైసీపీ ఎమ్మెల్యేలను ప్రోత్సహించారని చంద్రబాబు తెలిపారు. తనకు మైక్ ఇవ్వకుండా అవమానించారని, చివరకు మైక్ ఇచ్చి మధ్యలో కట్ చేసి అవమానించారని పేర్కొన్నారు. తనకు ఎలాంటి పదవులు, రికార్డులు అక్కర్లేదని, తన రికార్డు బద్దలు కొట్టాలన్నా సమయం పడుతుందని చంద్రబాబు తెలిపారు.

English summary
tdp chief chandrababu on today laments in pressmeet over ysrcp insult in ap assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X