తేల్చిచెప్పిన చంద్రబాబు.. డైలమాలో జేసీ బ్రదర్స్?
రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలో చురుగ్గా ఉంది ఎవరయ్యా... అంటే జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరులు అనే పేర్లు ఠక్కున గుర్తుకు వస్తాయి. పార్టీ ప్రతిష్టతోపాటు తమ సొంత ప్రతిష్టను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉండటంతో 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి వీరి కార్యకలాపాలు మరింత ఉధృతమయ్యాయి. జగన్ హవా కొనసాగినన్నాళ్లు అనంతపురం జిల్లాలో తమ హవాను కూడా నిలబెట్టుకోవాలనుకోవడమే దీనికి కారణం.

తాడిపత్రిలో రెపరెపలాడిన పసుపు జెండా
రాష్ట్రవ్యాప్తంగా
మున్సిపల్
ఎన్నికల్లో
వైసీపీ
గెలిస్తే
తాడిపత్రిలో
మాత్రం
పసుపు
జెండా
రెపరెపలాడింది.
పార్టీ
బలంతోపాటు
తమ
సొంత
బలాన్ని
కలగలిపి
పసుపు
జెండాను
రెపరెపలాడించగలిగారు.
తాడిపత్రిలో
తమ
ఆధిక్యతను
నిరూపించుకున్నారు.
వీరు
ఎంత
చురుగ్గా
ఉన్నప్పటికీ
పార్టీ
అధినేతకు
టచ్
లో
ఉండరు..
పార్టీ
కార్యకలాపాల్లో
పాల్గొనడం
బహు
తక్కువ.
సొంత
కార్యక్రమాలే
అజెండాగా
ఉంటాయి.
ఏ
పార్టీలో
ఉన్నప్పటికీ
ఆ
పార్టీ
అధినేతపట్ల
గౌరవభావం
కలిగివుండాలి.
కానీ
పార్టీ
కార్యక్రమాల్లో
పాల్గొనడమే
అరుదు
కావడంతో
వీరిపై
విమర్శలు
వస్తున్నాయి.

ఆచితూచి అడుగులు వేస్తోన్న టీడీపీ
అయితే
ఈసారి
ఎన్నికల్లో
గెలుపొక్కటే
ప్రత్యామ్నాయంగా
ఉండటంతో
టీడీపీ
ఆచితూచి
అడుగులు
వేస్తోంది.
కుటుంబానికి
రెండు
సీట్లిచ్చే
గత
సంప్రాదాయానికి
భిన్నంగా
ఈసారి
ఒక్క
కుటుంబానికి
ఒకటే
టికెట్
అంటూ
చంద్రబాబు
స్పష్టం
చేశారు.
ఇప్పటికే
రాప్తాడులో
పరిటాల
సునీత
పోటీచేయాల్సిందేనని
చంద్రబాబు
ఆదేశించారు.
సునీత
తనయుడు
శ్రీరాం
ధర్మవరం
ఇన్ఛార్జిగా
ఉన్నారు.
ఆ
టికెట్
ఆశిస్తున్నప్పటికీ
ఇవ్వనని
ఖరాఖండిగా
చెపేశారు.
తాజాగా
రానున్నఎన్నికల్లో
తాడిపత్రి
నుంచి
జేసీ
ప్రభాకర్
రెడ్డి
తనయుడు
అస్మిత్
రెడ్డి
కాకుండా
ప్రభాకర్
రెడ్డి
పోటీచేయాలని
చంద్రబాబు
తేల్చిచెప్పారు.

ఈసారికి వారసులు వద్దు?
అస్మిత్
రెడ్డి
గత
ఎన్నికల్లో
తాడిపత్రి
నుంచి
పోటీచేసి
ఓటమి
పాలయ్యారు.
అలాగే
అనంతపురం
ఎంపీగా
జేసీ
దివాకర్
రెడ్డిని
పోటీచేయాలని
చంద్రబాబు
కోరుతున్నారు.
దివాకర్
రెడ్డి
తనయుడు
జేసీ
పవన్
రెడ్డి
గత
ఎన్నికల్లో
ఎంపీగా
పోటీచేసి
ఓటమిపాలయ్యారు.
ఈసారికి
మాత్రం
వారసులు
కాకుండా
ప్రధాన
నేతలిద్దరూ
పోటీచేయాల్సిందేనని
చంద్రబాబు
స్పష్టం
చేసినట్లు
తెలుస్తోంది.
వీరిద్దరూ
పోటీచేస్తేనే
గెలుపు
ఖాయమని
చంద్రబాబుకు
సర్వే
నివేదికలు
వెల్లడించాయి.
దీంతో
తనయులు
కాకుండా
తండ్రులిద్దరూ
పోటీకి
దిగాల్సిందేనని
చెప్పినట్లు
సమాచారం.