ప్ర‌జ‌ల‌ ప్రాణాలు పోతున్నా జగన్‌కు పట్టదా.. కల్తీ కల్లు ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన కల్తీ కల్లు ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా జీలుగు కల్లు తాగి ఐగురుగు చనిపోవడం బాధాకరమని అన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతిని తెలిపారు. ఈఘటనపై సీఎం జగన్ ఇంతవరకు స్పందించకపోవడం దుర్మర్గమని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి

మృతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి

రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూస్తుందని చంద్రబాబు మండిప‌డ్డారు. జగన్ సర్కార్ తీసుకువచ్చిన మద్యం విధానం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్లు కూడా లేదని దుయ్యబట్టారు. బాధిత కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్ర‌భుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

కల్తీ జీలుగు కల్లు తాగిన ఐదుగురు మృతి

కల్తీ జీలుగు కల్లు తాగిన ఐదుగురు మృతి

తూర్పుగోదావరి జిల్లా రొజవొమ్మంగి మండలంలో దొడ్డిలో కల్తీ రాజవొమ్మంగి మండలంలో దొడ్డిలో కల్తీ జీలుగు కల్లు తాగిన ఘటనలో మృతుల సంఖ్య ఐదుకి చేరింది. కాకినాడలోని జీజీహెచ్ లో చికిత్సా పొందుతూ తాగా మరొక యువకుడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. దొడ్డిలో గిరిజనులు జీలుగు కల్లు తాగి అస్వస్థతకు గురై మృతి చెందారు. జీలుగు కల్లులో విషయం కలిపారంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Recommended Video

    Andhra Pradesh : Kakinada లో ఘనంగా Amma Vodi Scheme చెల్లింపుల కార్యక్రమం
    జీలుగు కల్లులో విషం

    జీలుగు కల్లులో విషం

    కల్తీ కల్లు ఘటనపై పోలీసుల‌ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వ‌చ్చాయి. జీలుగు కల్లులో విషం కలిసినట్టు ప్రాథమిక విచారణలో గుర్తించామని రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. కల్లులో విషం ఎలా కలిసిందన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. కల్తీ కల్లు తాగి ఐదుగురు గిరిజనులు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.

    కల్తీ కల్లు తాగిన ఐదుగురుకి కడుపులో తొలుత మంట, వాంతులు అయ్యాయన్నారు. అనంతరం కొద్ది సేపటికే నలుగురు మృతి చెందగా.. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరుగుతుందని కృష్ణకాంత్ తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+