వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్ర‌బాబు అటు తిర‌గ్గానే ఇటు మాయ‌మ‌వుతున్నారు?? నివేదిక సిద్ధం చేసిన అధిష్టానం

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు అధినేత చంద్ర‌బాబు ఒక‌వైపు చెమటోడ్చుతుండ‌గా, మ‌రోవైపు పార్టీలోని నేత‌లు ప‌లువురు స్పందించ‌డంలేదు. ఆయ‌న జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌కు వ‌చ్చిన‌ప్పుడు ఆ రెండురోజులు హ‌డావిడి చేస్తున్నారు. ప‌ర్య‌ట‌న ముగియ‌గానే మాయ‌మ‌వుతున్నారు. ఇలాంటివారిని గుర్తించి ఇప్ప‌టి నుంచే వారిని దూరం పెట్టాల‌నే డిమాండ్ టీడీపీలో ప్రారంభ‌మైంది.

 పొత్తు విషయమై స్పష్టత లేమి

పొత్తు విషయమై స్పష్టత లేమి


జ‌న‌సేన‌తో పొత్తు ఉంటుందా? లేదా? అనే విష‌య‌మై ఇప్ప‌టివ‌ర‌కు స్ప‌ష్ట‌త లేదు. ఇరుపార్టీల మ‌ధ్య ఈ విష‌యంలో ప్ర‌తిష్టంభ‌న నెల‌కొంది. ఇంత క‌ష్ట‌ప‌డి నియోజ‌క‌వ‌ర్గంలో ఖ‌ర్చుపెట్టి శ్ర‌మిస్తే చివ‌రి నిముషంలో పొత్తుల్లో భాగంగా త‌మ సీటు కేటాయిస్తే ఖ‌ర్చుచేసిన డ‌బ్బుల‌న్నీ బూడిద‌లో పోసిన ప‌న్నీర‌వుతాయ‌నే భావ‌న‌లో తెలుగు త‌మ్ముళ్లు ఉన్నారు. ఒక‌వేళ పొత్తు పొడిస్తే ఏయే సీట్లు కేటాయిస్తార‌నే విష‌యంలో కొంత అవ‌గాహ‌న ఉన్న నేత‌లు మౌనం వ‌హిస్తున్నారు. ఈ త‌ర‌హా నేత‌లు చంద్ర‌బాబు వ‌చ్చిన‌ప్పుడే క‌న‌ప‌డుతున్నార‌ని, ఇత‌ర స‌మ‌యాల్లో పార్టీని ప‌ట్టించుకోవ‌డంలేదంటూ కార్య‌క‌ర్త‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

 ఒంటరిగా వెళ్లి ఘనవిజయం సాధిద్దాం

ఒంటరిగా వెళ్లి ఘనవిజయం సాధిద్దాం


పొత్తుల‌తో సంబంధం లేకుండా ముందుగా ఎవ‌రి ప‌ని వారు చేసుకోవాల‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. ఒంట‌రిగా వెళ్లి ఘ‌న‌విజ‌యం సాధించాల‌నే యోచ‌న‌తో పార్టీ ఉంద‌ని, అయితే చివ‌రి నిముషంలో పొత్తుల‌పై ఒక స్ప‌ష్ట‌త రావొచ్చ‌ని, జ‌న‌సేన‌కు దాదాపు 40 సీట్లిచ్చే అవ‌కాశం ఉంద‌ని పార్టీ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. పార్టీకి ఇప్పుడున్న సీట్ల‌తోపాటు 2014లో గెలిచి 2019లో ఓట‌మిపాలైన నియోజ‌క‌వ‌ర్గాల్లోని నేత‌లు మాత్రం త‌మ ప‌ని తాము చేసుకుపోతున్నారు. ఇతర నియోజకవర్గాల్లోని నేతలు మాత్రం ప్రజలకు ముఖం చాటేస్తున్నారని, వీరిని ఒక కంట కనిపెట్టివుంచాలనే డిమాండ్ వస్తోంది.

నిరంతరం ప్రజలమధ్యే ఉండండి

నిరంతరం ప్రజలమధ్యే ఉండండి


నిరంతరం ప్రజల మధ్య ఉండాలని, వారి సమస్యలను పట్టించుకోవాలని, ఎక్కడైతే ప్రభుత్వ వ్యతిరేకత కనపడుతుందో అక్కడ ఇంకా పటిష్టం కావాలని, అందుకు అధిష్టానంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని నేతలకు బాబు సూచిస్తున్నారు. అయినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న నేతలపై ఏం చేయాలనే విషయమై అధిష్టానం ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చిందని, వారిపై నివేదిక కూడా సిద్ధమైనట్లు సమాచారం. రానున్న ఎన్నికలతో చావో? రేవో? తేల్చుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఎటువంటి అలసత్వానికి తావివ్వకూడదనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఉంది. గతంలోలా మొహమాటాలకు పోకుండా కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్న తరుణంలో టీడీపీ భవిష్యత్తు నిర్ణయాలు ఆసక్తికరంగా ఉంటాయని పలువురు సీనియర్ రాజకీయవేత్తలు విశ్లేషిస్తున్నారు.

English summary
There are many TDP leaders who rush to the constituencies only when Chandrababu comes and then show their faces
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X