పవన్ కల్యాణ్ బాధ్యత తీసుకున్న చంద్రబాబునాయుడు?

జనసేనకు చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికీ బలమైన అభ్యర్థులు లేరు. వారికి కేటాయించే నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల ఎంపిక కూడా చంద్రబాబుపైనే పడింది.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగమే జనసేన పార్టీతో పొత్తులు. గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీచేయడంవల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 60 శాసనసభా నియోజకవర్గాలను కైవసం చేసుకోగలిగిందనే అంచనాలున్నాయి. ఈసారి అటువంటి తప్పిదం జరగకూడదన్న ఉద్దేశంలో ఉన్న చంద్రబాబు జనసేనతో పొత్తుతో వెళ్లబోతుండటాన్ని దాదాపుగా ఖాయం చేసుకున్నారు.

జనసేనకు బలమైన అభ్యర్థులు కరవు!

జనసేనకు బలమైన అభ్యర్థులు కరవు!

జనసేన పార్టీకి ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా బలమైన అభ్యర్థులు లేరు.. క్షేత్రస్థాయిలో బలం లేదు. కానీ ఆ పార్టీని కలుపుకొని వెళ్లడంవల్ల ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుందని భావిస్తున్నారు. జనసేన పార్టీలో రాష్ట్రస్థాయి నేతలు కూడా లేరు. పవన్ కల్యాణ్ తర్వాత రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా ఉన్న నాదెండ్ల మనోహర్ తోపాటు కందుల దుర్గేష్, పోతుల మహేష్.. ఇలా కేవలం వేళ్లమీద లెక్కించే స్థాయిలోనే నేతలున్నారు. చాలా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు కూడా లేరు. దీంతో ఆ బాధ్యతను కూడా చంద్రబాబునాయుడు తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించాలనుకుంటున్న నియోజకవర్గాల జాబితా ఇప్పటికే సిద్ధమైంది.

ప్రత్యర్థి పార్టీకి అవకాశం ఇచ్చినట్లే!

ప్రత్యర్థి పార్టీకి అవకాశం ఇచ్చినట్లే!

ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టకపోతే ప్రత్యర్థి పార్టీకి అవకాశం ఇచ్చినట్లే. 2009 ఎన్నికల సమయంలో అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకున్న టీడీపీ మహాకూటమిని ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్లింది. కానీ టీఆర్ఎస్ తరపున దాదాపు 50కి పైగా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు లేకపోవడంవల్ల కాంగ్రెస్ పార్టీ ఆయా స్థానాల్లో సునాయాస విజయం సాధించింది. మరోసారి అటువంటి తప్పు పునరావృతం కానివ్వకూడదనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు.

లెక్కలన్నీ సరిజూసుకున్న తర్వాతే ప్రకటన?

లెక్కలన్నీ సరిజూసుకున్న తర్వాతే ప్రకటన?


జనసేనకు కేటాయించే నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టాల్సిన బాధ్యత కూడా చంద్రబాబుపై ఉంది. దీంతో ఆయన ఇతర పార్టీల నుంచి టీడీపీలో చేరతామని వచ్చే కొందరు నేతలను జనసేనలోకి పంపిస్తున్నారు. దీనివల్ల నియోజకవర్గ స్థాయిలో బలమైన అభ్యర్థిత్వం దొరుకుతుందని అంచనా వేస్తున్నారు. జనసేనకిచ్చే నియోజకవర్గాలు.. వాటిల్లో పోటీకి దిగాల్సిన బలమైన అభ్యర్థులు.. వీటిని సరిజూసుకున్న తర్వాతే రెండు పార్టీ మధ్య పొత్తును అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+