విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అయ్యన్న, గంటా వివాదం: సమన్వయకమిటీతో బాబు అత్యవసర బేటీ

విశాఖపట్టణం జిల్లాలోని ఇద్దరు మంత్రుల మద్య గొడవలు రోజురోజకు ఎక్కువౌతున్నాయి. దీంతో టిడిపి నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:విశాఖపట్టణం జిల్లాలోని ఇద్దరు మంత్రుల మద్య గొడవలు రోజురోజకు ఎక్కువౌతున్నాయి. దీంతో టిడిపి నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యవహరంతో పార్టీ తీవ్రంగా నష్టపోతోందని మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాయడంతో ఈ విషయమై చంద్రబాబునాయుడు గురువారంనాడు పార్టీ నాయకులతో అత్యవసరంగా సమావేశమయ్యారు.

విశాఖ జిల్లాలోని ఇద్దరు మంత్రుల మధ్య ప్రచ్చన్న యుద్దం సాగుతోంది. భూ కుంభకోణంపై మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం కల్గించేలా ఉన్నాయంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. గంటా రాసిన లేఖ మీడియాలో రావడంతో ఈ విషయమై రచ్చ జరిగింది.

 Tdp chief Chandrababu naidu meeting with coordination committe in Amaravati

దీంతో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు గురువారం నాడు అత్యవసరంగా పార్టీ సమన్వయ కమిటీతో అత్యవసరంగా సమావేశమయ్యారు. మంత్రులు గంటా, అయ్యన్న వివాదంపై ప్రధానంగా చర్చించనున్నారు. మంత్రులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై నిశితంగా బేటీలో చర్చించనున్నారు. అనంతరం జిల్లా పార్టీ అద్యక్షుడి ఎన్నిక విషయంలో చర్చించే అవకాశం ఉంది.

నంద్యాల ఉప ఎన్నికల్లో అభ్యర్థిని ఎంపిక చేసే విషయమై కూడ పార్టీ సమన్వయకమిటీ సమావేశంలో చర్చించనున్నారు. ఇవాళ మధ్యాహ్ననికి ఉప ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి ఎవరనే విషయంపై స్పష్టత రానుంది.

English summary
Tdp chief Chandrababu naidu meeting with coordination committe in Amaravati on Thursday. The committee will discuss on ministers Ganta Srinivasa Rao and Ayyanna Patrudu differences.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X