నన్ను అవమానించేందుకే అసెంబ్లీ: ట్విట్టర్‌లో చంద్రబాబు నాయుడు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో తనను కావాలనే టార్గెట్ చేస్తున్నారని, పూర్తిగా ప్రజా సమస్యలను పక్కన పెట్టి తనపై విమర్శలు చేసేందుకే అసెంబ్లీని ఉపయోగించుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ కొనసాగేది... సమస్యలు పరిష్కరించడానికా... లేక తనను అవమానించడానికా అంటూ... ప్రభుత్వాన్ని నిలదీశాడు. సభలో జరిగిన పరిణామాలపై చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

అసెంబ్లీలో ఇరుపక్షాల మధ్య మాటల యుద్దం

గురువారం జరిగిన అసంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పత్రికలపై తీసుకువచ్చిన జీవోను రద్దు చేయాలని, నల్ల రిబ్బన్లు, ప్లకార్డులు పట్టుకుని అసెంబ్లీలోకి వెళుతున్న చంద్రబాబు నాయుడుతో పాటు ఎమ్మెల్యేలను మార్షల్స్ అడ్డుకోవడంతో ఆయన అసెంబ్లీ గేటు ముందే అందోళనన నిర్వహిచారు. అనంతం సభలో సీఎంను ఉన్మాది అంటూ చేసిన వ్యాఖ్యలపై రభస కొనసాగింది. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిందుకు చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలంటూ... అధికార పక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఈనేపథ్యంలోనే ఇరు పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగింది.

40 నిమిషాలు అసెంబ్లీ బయటే

దీంతో చంద్రబాబునాయుడు ట్విట్టర్ వేదికగా అధికార పార్టీపై ఫైర్ అయ్యారు. సభలో పదే పదే తనకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం అంటూ ఎగతాళీ చేస్తున్నారని , దీంతో పాటు 40 నిమిషాల మేర అసెంబ్లీ గేటు ముందే నిలబెట్టడం వంటి చర్యలకు ఉద్దేశ్యపూర్వకంగా పూనుకున్నారని ఆయన ఆరోపించారు. అయితే ప్రజల కోసం ఎన్ని అవమానాలనై భరిస్తానని చెప్పారు. ప్రభుత్వం పేదల ఎజెండాను వదిలి వేసి ప్రతిపక్షాన్ని అణిచి వేసే ఎజెండానే పెట్టుకుందని .. దీంతో ఆపార్టీ పతనం ఖాయమని హెచ్చరించారు.

నేడు చీకటి రోజు

ఇక ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే మీడీయా అంక్షల్లో బాగంగా తీసుకువచ్చిన జీవో 2430ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతోపాటు చానళ్ల నిషేధం కూడ ఎత్తి వేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వం వ్వవహరించిన తీరుతో నేడు చీకటీ రోజుగా అయన అభివర్ణించారు. ప్రభుత్వం తప్పులను నిలదీసే ప్రతిపక్ష పార్టీతోపాటు నిజాలు చెప్పే మీడియా అన్నా ప్రభుత్వానికి భయమని ఆయన విమర్శించారు. అందుకే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మార్షల్స్‌తో బయటకు గెంటివేసి ప్రజల గొంతును నొక్కేలా ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ప్రతిపక్షాలకు సరైన విలువ ఇచ్చి శాసన సభ గౌరవాన్ని నిలబెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+