విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుండెపోటుతో మొదలై.. గొడ్డలిపోటు దాకా !.. 40 కోట్ల సుపారీ ఎవరి రక్తచరిత్ర ? : చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవాస్తవాలు, తప్పుడు ప్రచారాలతో అధికారంలోకి వచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. వైసీపీ దుర్మార్గాలను ఎండగడుతూ వాస్తవాలను ప్రచారం చేయాలని ఐటీడీపీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రజల ముందు వాస్తవాలను ఉంచి వైసీపీ అడ్రస్ లేకుండా చేయాలన్నారు. పేటిఎం బ్యాచ్‌తో టీడీపీపై వైసీపీ చేయిస్తున్న విషప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. సెల్‌ఫోన్లే ఐటీడీపీ కార్యకర్తల ఆయుధాలని చంద్రబాబు చెప్పారు .

చేత‌కానివాళ్లే కులలు గురించి మాట్లాడ‌తారు.

చేత‌కానివాళ్లే కులలు గురించి మాట్లాడ‌తారు.

అభివృద్ధిం చేయడం చేతకాని వాల్లే కులాలు, మతాలు, ప్రాంతాల గురించి మాట్లాడతారని వైసీపీ నేతలను ఉద్దేశించి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమర్థులు అభిృద్ధి గురించి ఆలోచనలు చేస్తారన్నారు. తన కులం, మతం తెలుగువారే . వారంతా తన కుటుంబ సభ్యులని పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయాంలో ఐటీడీపీ కార్యకర్తలతో సమావేమైన చంద్ర‌బాబు.. సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు. నిజాలను వెలికితీయడంతో ఐటీడీపీ కార్యకర్తలు మరింత చురుగ్గా పనిచేయాలని సూచించారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం..

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం..

టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు ఎన్నో అక్రమ కేసులు పెట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి కేసులకు భయపడాల్సినవసరం లేదన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే అక్రమ కేసులను రద్దు చేస్తామని కార్యకర్తలకు చంద్రబాబు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజల కష్టాలను వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్య‌త‌ ఐటీడీపీ సభ్యులపై ఉందని పేర్కాన్నారు. పేటీఎం బ్యాచ్‌ను అడ్డుపెట్టుకుని టీడీపీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

 40 కోట్ల సుపారీ ఎవరి రక్త చరిత్ర ?

40 కోట్ల సుపారీ ఎవరి రక్త చరిత్ర ?

అటు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారంలో వైసీపీ నేతల తీరుపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఏంజరిగినా తమకు అంటగడుతున్నారని దుయ్యబట్టారు. బాబాయ్‌ను చంపి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తొలుత గుండె పోటుతో మొదలై గొడ్డలిపోటుకు మారిందని విమర్శలు గుప్పించారు. 40 కోట్ల సుపారీ ఎవరి రక్త చరిత్ర ? అని ప్రశ్నించారు. మానవత్వం లేకుండా అత్యంత కిరాతకంగా చంపి.. పక్కవారిపై నేపం మోపుతున్నారని ఆరోపించారు. సిగ్గులేకుండా సీబీఐపై ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. సినిమాల్లో కూడా ఇలాంటి సీన్ చూడలేదేదని ఎద్దేవా చేశారు.

Recommended Video

YS Vivekananda Reddy కేసులో YS Jagan ని విచారించాలని TDP డిమాండ్| YSRCP | Oneindia Telugu
ఫ‌లించిన అమ‌రావ‌తి రైతుల పోరాటం

ఫ‌లించిన అమ‌రావ‌తి రైతుల పోరాటం

రాజధాని అమరావాతి రైతుల పోరాటం ఫలించిందని చంద్రబాబు అన్నారు. హైకోర్టు తీర్పును కూడా బ్లూ మీడియాలో చూపించలేదని విమర్శించారు. వారు చూపించపోతే వాస్తవాలు ప్రజలకు చేరకుండా ఆగిందా అని ప్రశ్నించారు. అమరావాతి కులాన్ని అంటగట్టారని మండిపడ్డారు. పోలవరాన్ని టీడీపీ పాలనలోనే 72 శాతం పూర్తిచేశామని చెప్పారు. మరలా టీడీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఈపాటికి 100శాతం పనులు పూర్తయ్యేవని పేర్కొన్నారు.

English summary
TDP Chief Chandrababu Naidu slam CM Jagan over YS Vivekananda Reddy case
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X