సజ్జలకు చంద్రబాబు బ్రేకింగ్ న్యూస్

ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్న విషయాన్ని గమనమించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు పాల్పడుతోందని బాబు మండిపడ్డారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో పోలీసుల దాడిలో గాయపడిన పార్టీ కార్యకర్తలను పరామర్శించారు. నిన్న పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడంతో పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని చంద్రబాబు పరామర్శించడమేకాకుండా వారికి అండగా పార్టీ నిలబడుతుందనే భరోసానిచ్చారు. కార్యకర్తలంతా త్వరగా కోలుకోవాలని, అక్రమ కేసులపై న్యాయబద్ధంగా పోరాడదామని ధైర్యం చెప్పారు.

అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్న విషయాన్ని గమనమించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. అనపర్తిలో పోలీసులను పురిగొల్పి పంపడంతోపాటు ముందురోజు సభకు అనుమతిచ్చారని, అప్పటికప్పుడు అనుమతి లేదంటూ అరాచకం సృష్టించారన్నారు. జగ్గంపేట, పెద్దాపురంలో లేని ఆంక్షలు అనపర్తిలో ఎందుకొచ్చాయని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు నిర్వహించే సభలను అడ్డుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోదంటూ ధ్వజమెత్తారు.

tdp chief chandrababu naidu suggestions to ap police

చట్టవ్యతిరేకంగా పనిచేయాలంటూ పోలీసులపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తోందని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో కొంతమంది పోలీసులు అరాచకాలు సృష్టిస్తున్నారని, కావాలనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడిచేశారని ఆరోపించారు. అధికారంలో ఉన్నారుకదా అని వారు చెప్పే చట్ట వ్యతిరేక పనులకు పోలీసులు సహకరించొద్దని, దీనివల్ల పోలీసులకు ఇబ్బందులు కలుగుతాయని చెప్పారు. తమ పార్టీ కార్యకర్త ప్రకాశ్ నాయుడిని గుండెలపై కొట్టడంతో అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పోలీసులు సహకరించొద్దని తాను కోరుతున్నట్లు చెప్పారు. చట్టానికి అనుగుణంగానే విధులు నిర్వహించాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+