వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రాబ్యాంకు విలీనం వద్దు, కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రా బ్యాంకును విలీనం చేయవద్దంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారమన్‌‌కు లేఖ రాశారు. ఈనేపథ్యంలో ఆంధ్రబ్యాంకు విలీనాన్ని తెలుగు ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని లేఖలో పేర్కోన్నారు. ఆ పేరు తెలుగువాళ్ల సెంటిమెంట్‌తో ముడిపడి ఉందని తెలిపారు. ఇక తెలుగు వాళ్ల నమ్మకం పెంచుతూ ఆంధ్రబ్యాంక్ పలు సేవలు అందించిందని చెప్పారు. ఒక వేళ బ్యాంకుల విలీననం అవసరమైతే ఆంధ్రాబ్యాంకు పేరునే కొనసాగించాలని ఆయన లేఖలో పేర్కోన్నారు.

TDP chief Chandrababu Naidu wrote a letter to Union Finance Minister on the merger of Andhra Bank.

ఆర్ధిక సంస్కరణలో పాటు బ్యాంకులను నష్టాల బాటనుండి గట్టేక్కించేందుకు కొద్ది రోజుల క్రితం పలు బ్యాంకులను విలీనం చేస్తున్నట్టు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇందులో బాగంగానే దశబ్దాల చరిత్ర ఉన్న ఆంధ్రాబ్యాంకు సైతం నష్టాల్లో ఉండడంతో దాన్ని యూనియన్ బ్యాంకులో వీలినం చేశారు. అయితే విలీన ప్రక్రియను స్వాగతించిన టీడీపీ అధినేత చంద్రబాబు విలీన ప్రక్రియ ప్రజల్లో నమ్మకం పెంచుతుందని అన్నారు. అయితే ఆంధ్రాబ్యాంకును మాత్రం విలీనం చేయద్దని కేంద్రానికి లేఖ రాశారు.

English summary
Former chief minister and TDP chief Chandrababu Naidu wrote a letter to Union Finance Minister Nirmala Sitharaman on the merger of Andhra Bank.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X