చంద్రబాబు ట్రాప్ లో జగన్ చిక్కుతారా - తొలి సారిగా మోదీ ప్రభుత్వంపై : బీజేపీ - పవన్ పై కొత్త వ్యూహంతో..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు పోటీ పడుతున్నాయి. తాజాగా, కేంద్ర బడ్జెట్ పైన వైసీపీ - టీడీపీ స్పందించాయి. వైసీపీ నుంచి ఎంపీలు రియాక్ట్ కాగా... టీడీపీ నుంచి పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. ఆయన దాదాపుగా ఈ మధ్య కాలంలో తొలి సారిగా కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు చేసారు. అదే సమయంలో వైసీపీ ఎంపీల అసమర్ధత గురించి ప్రశ్నించారు. ఈ విషయంలో చంద్రబాబుకు పక్కాగా జగన్ 2019 ఎన్నికల ముందు అనుసరించిన ఫార్ములానే ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తోంది.

చంద్రబాబు పక్కా వ్యూహంతో

చంద్రబాబు పక్కా వ్యూహంతో

నాడు కేంద్రం పైన జగన్ విమర్శలు చేస్తూ...నాడు బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న టీడీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసి..సక్సెస్ అయ్యారు. ఇప్పుడు బీజేపీతో మిత్రపక్షంగా కాకపోయినా.. వైసీపీ సఖ్యతగా కొనసాగుతోంది. అయితే, టీడీపీ వచ్చే ఎన్నికల నాటికి తిరిగి బీజేపీ - జనసేనతో కలిసి జగన్ పైన రాజకీయ పోరాటం చేయాలని భావిస్తోంది.

అందులో భాగంగానే..చంద్రబాబు కొత్త వ్యూహానికి తెర లేపారు. కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు చేయటం ద్వారా సీఎం జగన్..వైసీపీ పైన ఒత్తిడి పెంచే వ్యూహం అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు విమర్శలతో..వైసీపీ నేతలు సైతం కేంద్రం పైన మాటల దాడి చేస్తోంది. పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి తాజాగా.. కేంద్రం దక్షిణాది రాష్ట్రాల పైన ఫోకస్ పెట్టాలంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇక, జగన్ నేరుగా స్పందించకపోయినా..ఆయన కేబినెట్ లోని ఆర్దిక మంత్రి సైతం కేంద్రం బడ్జెట్ ఆశాజనకంగా లేదని వ్యాఖ్యానించారు.

సీఎం జగన్ ను ఫిక్స్ చేసేలా

సీఎం జగన్ ను ఫిక్స్ చేసేలా

బీజేపీ మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ కేంద్ర బడ్జెట్ ను స్వాగతించారు. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు కుప్పం పర్యటనలో జనసేనతో పొత్తు పైన సానుకూల సంకేతాలు ఇచ్చారు. కానీ, అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ నుంచి మాత్రం స్పందన రాలేదు. అదంతా మైండ్ గేమ్ గా అభివర్ణించారు. దీంతో...ఏపీ ప్రయోజనాల గురించి చంద్రబాబు కేంద్రాన్ని ప్రశ్నిస్తూ... కేంద్రంతో సన్నిహితంగా ఉంటున్న వైసీపీ..జనసేన అదే సమయంలో బీజేపీని ఆత్మరక్షణలో నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

కేంద్రం నుంచి రావాల్సినవి చాలా ఉన్నా వాటిని రాబట్టుకోవడంలో వైసీపీ ప్రభుత్వం మరోసారి ఘోరంగా విఫలమైందని విమర్శించారు. వైసీపీకి 28మంది ఎంపీలు ఉండి ఏం సాధించారని ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులపై ఒత్తిడి తేవడంలో సీఎం జగన్‌ అసమర్థత బయటపడిందని ఫైర్ అయ్యారు. కొవిడ్‌తో దెబ్బతిన్న రంగాలకు ఎటువంటి చేయూత ఇస్తారో కూడా చెప్పలేదన్నారు.

తొలి కేంద్రం పైనా విమర్శలు

తొలి కేంద్రం పైనా విమర్శలు

జాతీయ ఆహార భద్రత పథకంలో తన బాధ్యత నుంచి కేంద్రం తప్పుకొంటున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఇటువంటి ఆలోచన సరికాదన్నారు. పేదలకు భారంగా మారిన నిత్యావసరాల ధరలను తగ్గించడానికి ఎటువంటి చర్యలు ప్రకటించకపోవడం సరికాదంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీని ద్వారా బీజేపీ ..మిత్రపక్షం జనసేన సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కల్పించటమే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోంది.

దీంతో..బీజేపీ తమతో కలిసి రావటానికి సుముఖంగా లేకున్నా..పవన్ వారి నుంచి దూరం అయితే..సహజంగా టీడీపీ వైపే వచ్చే అవకాశం ఉంటుందని పార్టీ నేతల అంచనా. దీంతో.. తమను దూరం పెడుతున్న బీజేపీకి..ఏపీలో ఇతర పార్టీలు దూరంగానే ఉండే విధంగా టీడీపీ పావులు కదుపుతోంది.

Recommended Video

    Pawan Kalyan On TDP-Janasena Alliance జనసేన చుట్టూ AP Politics | Oneindia Telugu
    టీడీపీతో కలిసే విధంగా కొత్త గేమ్ మొదలు

    టీడీపీతో కలిసే విధంగా కొత్త గేమ్ మొదలు

    అందులో బాగంగానే.. 2019 ఎన్నికల తరువాత ఇప్పటి వరకు కేంద్రం పైన ఎప్పుడూ వ్యతిరేక వ్యాఖ్యలు చేయని.. చంద్రబాబు ఇప్పుుడు ఓపెన్ గా తన అభిప్రాయాలను స్పష్టం చేసారు. దీని ద్వారా...ఇక, టీడీపీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందనే సంకేతాలు ఇస్తూ.. ప్రతిపక్షాలను డిఫెన్స్ లోకి నెట్టే వ్యూహం అమలు చేస్తున్నారు. దీనిని రానున్న రోజుల్లోనూ కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    ఇప్పటికే పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర నిర్ణయాలు..తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే ఏపీ సీఎం జగన్ మాత్రం వేచి చూసే ధోరణితో ఉన్నారు. ఇదే సమయంలో చంద్రబాబు మరింత ఒత్తిడి పెంచే విధంగా అడుగులు వేస్తున్నారు. ఇక, ఈ పరిణామాలతో రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తి కరంగా మారే అవకాశం కనిపిస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+