చంద్రబాబు, పవన్ కు ప్రధాని మోదీ ఆహ్వానం - కీలక భేటీ..!!
ఏపీలో మరి కొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల పోరు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తూనే ఓటర్లను ఆకట్టుకొనేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏపీలో ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఇతర ప్రాంతాల్లో ఉన్న వారంతా స్వస్థలాలకు చేరుకుంటున్నారు. అటు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సమయంలో ప్రధాని మోదీ నుంచి చంద్రబాబు, పవన్ కు ఆహ్వానం అందింది.
ఈ నెల 14న ప్రధాని మోదీ వారణాసిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. తన నామినేషన్ కార్యక్రమానికి రావాల్సిందిగా ఎన్డీఏ మిత్రపక్షాల నేతలను ప్రధాని ఆహ్వానించారు. ఇందులో భాగంగా తన నామినేషన్ కార్యక్రమానికి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి మోదీ ఆహ్వానం అందింది. చంద్రబాబుతో పాటుగా పవన్ వారణాసి కి వెళ్లే అవకాశం ఉంది. చంద్రబాబు మంగళవారం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో వారణాసి వెళ్తారు. మోదీ నామినేషన్ సమర్పణ కార్యక్రమ అనంతరం ఎన్డీఏ పక్షాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు.

టీడీపీ తిరిగి ఎన్డీఏలో చేరిన తరువాత ఎన్డీఏ సమావేశం జరగలేదు. వెంటనే ఎన్నికల కోడ్ రావటం..ఏపీలో ఎన్నికల ప్రచారం కోసం మోదీ రాష్ట్రానికి వచ్చారు. రేపు (సోమవారం) ఏపీలో 25 ఎంపీ, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఏపీలో గెలుపు, మెజార్టీ ఎంపీ సీట్లు దక్కుతాయనే అంచనాలతో కూటమి నేతలు ఉన్నారు. కూటమి పార్టీల మధ్య ఓట్ల బదిలీ చివరి నిమిషంలో కీలకం కానుంది. ప్రస్తుతానికి పోటీ హోరా హోరీగా కనిపిస్తున్నా...పోలింగ్ ముగిసే సమయానికి ఓటింగ్ సరళి పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో పోలింగ్ ముగిసిన మరుసటి రోజునే చంద్రబాబు..ప్రధాని మోదీతో సమావేశం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
-
"అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు": భారత్ స్థానం మారింది - ప్రధాని మోడీ -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications