ఏపీలో రేషన్‌ కార్డుదారులకు శుభవార్త.. మూడునెలలు కందిపప్పుతో పాటు ఇవి కూడా!

ఆంధ్రప్రదేశ్‌లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు నిత్యావసర వస్తువుల ధరల భారం తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు, గోధుమపిండి, పామాయిల్‌ను రాయితీ ధరలకే అందించాలని నిర్ణయించింది. ఈ పథకం కింద కిలో కందిపప్పు రూ.100కు, కిలో గోధుమపిండి రూ.25కు, లీటరు పామాయిల్ రూ.125కు కార్డుదారులకు అందుబాటులోకి రానుంది.

ఇకపై విద్యాసంస్థల్లో అలాంటివి చేయడం నిషేధం.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!
ఇకపై విద్యాసంస్థల్లో అలాంటివి చేయడం నిషేధం.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల నిత్యావసరాల ధరలపై సమీక్ష నిర్వహించి అధికారులను ఆదేశించారు. మార్కెట్‌లో కందిపప్పు రూ.170 నుంచి రూ.200 వరకు అమ్ముతున్న నేపథ్యంలో ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించాలని స్పష్టం చేశారు. మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలోనూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మూడు నెలల పాటు ఈ సరుకులు రాయితీపై పంపిణీ చేయనున్నారు.

AP Govt: ఉద్యోగుల e-SRపై ప్రభుత్వం కీలక నిర్ణయం- ఇకపై ఆ రికార్డులన్నీ..!
AP Govt: ఉద్యోగుల e-SRపై ప్రభుత్వం కీలక నిర్ణయం- ఇకపై ఆ రికార్డులన్నీ..!
AP Government to Supply Subsidised Toor Dal Wheat Flour and Palm Oil Through Ration Shops

ఈ పథకం అమలుకు నెలకు సుమారు రూ.100.20 కోట్లు, మూడు నెలలకు రూ.300.60 కోట్లు రాయితీగా ప్రభుత్వం భరించనుంది. ధరల స్థిరీకరణ నిధి కింద కేంద్రం నుంచి 1.20 లక్షల టన్నుల కందులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా, 40,338 టన్నులు కేటాయించారు. ముడి కందుల లభ్యతను బట్టి సేకరణ, పప్పు తయారీకి ఒప్పందాలు చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

పామాయిల్‌ను పారదర్శక పోటీ ప్రక్రియ ద్వారా సేకరించాలని, మూడు నెలల తర్వాత కార్యక్రమాన్ని పొడిగించాల్సి వస్తే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.ప్రతి రేషన్ కార్డుకు నెలకు ఒక కిలో కందిపప్పు, ఒక లీటరు పామాయిల్ అందించనున్నారు. గోధుమపిండి విషయంలో నెలవారీ కోటా 3,384 మెట్రిక్ టన్నులుగా నిర్ణయించారు. ఇది ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చే విధానంలో అందుబాటులో ఉంటుంది.

డిసెంబర్ నెల నుంచి సంక్రాంతి వరకు ఈ పథకం కొనసాగే అవకాశం ఉంది. ఇలా మూడు వస్తువులు కలిపి రూ.250కే అందడం వల్ల కుటుంబాలకు గణనీయమైన ఉపశమనం లభిస్తుంది.ఇప్పటికే రైతు బజార్ల ద్వారా ఉల్లిపాయలు రూ.35కు, ధరణి బ్రాండ్ బియ్యం రూ.49-50కు అందుబాటులో ఉంచుతున్న నేపథ్యంలో తాజా నిర్ణయం మరో ముఖ్యమైన నిర్ణయంగా మారింది. ధరల నియంత్రణకు సరిహద్దు చెక్ పోస్టుల్లో నిఘా పెంచి, అక్రమ రవాణాను అరికట్టే చర్యలు కూడా చేపడుతున్నారు.

పేదలు, ఉద్యోగులు, చిన్న వ్యాపారులు అందరూ రోజువారీ ఖర్చుల్లో భాగమైన ఈ వస్తువుల ధరలు పెరిగి ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సాధారణ ప్రజలకు నిజమైన ఉపశమనం కలిగిస్తుంది. రేషన్ దుకాణాల్లో సకాలంలో సరుకులు అందుబాటులోకి రావాలని, నాణ్యతపై దృష్టి సారించాలని అధికారులకు సీఎం సూచించారు. ఈ పథకం విజయవంతంగా అమలు కావడంతో రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు నియంత్రణలోకి రావడమే కాకుండా, ప్రజల విశ్వాసం మరింత పెరుగుతుందని ఆశిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+