‘రైతు భరోసా’ నిధుల విడుదలపై కీలక నిర్ణయం, ముహూర్తం..!!
రైతు భరోసా పై కీలక అప్డేట్. ఎల్ నినో కష్టాల వేళ రైతులకు అండగా నిలవాలని ప్రభుత్వ తాజా నిర్ణయంతో భరోసా నిధుల జమ పైన కసరత్తు మొదలైంది. ఇప్పటికే అర్హులైన రైతులకు రుణాల రీ షెడ్యూల్ పైనా బ్యాంకులకు ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. రైతులు సాగుచేసిన పంటలకు నీరులేక ఎండిపోతున్న పరిస్థితి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను సైతం ప్రకటించింది. దీంతో, రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు ముహూర్తం సైతం దాదాపు ఖరారైంది.
తెలంగాణలో ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. సాగు చేసే అవకాశం లేక పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటన చేసింది. యాసంగిలో వరిసాగు చేయొద్దని.. ఆరు తడి పంటలు సాగు చేయాలని రైతులకు స్పష్టం చేసింది. కాగా. యాసంగి పెట్టుబడి సాయం కింద ప్రతీయేటా ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ సారి పంటలు లేకపోవటంతో రైతు భరోసా నిధులు అందవనే ప్రచారం జరిగింది. దీంతో.. ప్రభుత్వం రైతులకు మద్దతుగా నిలవాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఈసారి సాగు తగ్గినా కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులకు పూర్తిస్థాయిలో రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

ప్రభుత్వం కసరత్తు
ప్రస్తుత పరిస్థితుల్లో అర్హులైన ప్రతి రైతు బ్యాంక్ ఖాతాల్లో పంట సాగుచేసినా, చేయకపోయినా రైతు భరోసా నిధులు జమ చేసే విధంగా కసరత్తు కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం, యాసంగి సీజన్ల ప్రారంభంలో పెట్టుబడి సాయం కింద ప్రతీ ఎకరానికి రూ.6వేల చొప్పున రెండు విడతల్లో ఎకరానికి రూ.12వేలను అర్హులైన రైతులకు అందిస్తోంది. ఈ యాసంగిలో సాగు విస్తీర్ణం భారీగా తగ్గే అవకాశం నెలకొంది. రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల్లో కూడా పంటలు సాగయ్యే అవకాశం లేదని అంచనా వేశారు. అయితే, ప్రభుత్వం ఇప్పటివరకు సాగయ్యే భూములకే రైతు భరోసా నిధులు జమ చేస్తోంది. కాగా.. ఈ సారి మాత్రం రైతులకు పూర్తిస్థాయిలో రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం. డిసెంబర్ 7వ తేదీతో రేవంత్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తి చేసుకుంటోంది. అదే రోజున రైతులకు అందరికీ ఈ నిధులు అందే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు సమాచారం.













Click it and Unblock the Notifications
