ఆ ఇద్దరు నేతలకు చంద్రబాబు మాస్ వార్నింగ్
పార్టీలో క్రమశిక్షణ దాటుతున్న తెలుగు తమ్ముళ్లకు అధినేత చంద్రబాబునాయుడు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. క్రమ శిక్షణ తప్పుతున్నవారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. పార్టీ సమావేశం జరుగుతున్న సమయంలో చంద్రబాబు ఎదుట సీనియర్ నాయకులు కొందరు ప్రత్తిపాటి పుల్లారావు, కోడెల శివరామ్ అంశాలను ప్రస్తావించారు. నేతలు ఎంతటివారైనా కఠినచర్యలు తప్పవని బాబు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
సత్తెనపల్లిలో ఇన్చార్జి పదవి ఇవ్వటం, రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వటంపై చంద్రబాబును ఉద్దేశించి కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరామ్ మీడియాతో మాట్లాడారు. తన తండ్రి కోడెల శివప్రసాద్ మరణించినపుడు జరిగిన పరిణామాలను ఆయన ప్రస్తావించారు. తర్వాత జరిగిన అభివృద్ధి పనుల్లో బాబును తప్పుపట్టారు. కన్నా లక్ష్మీనారాయణను ఇన్చార్జిగా నియమించటాన్ని శివరామ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయనతో చర్చించడానికి బాబు ఇద్దరు నాయకులను పంపించినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు.

అలాగే చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించిన టికెట్ విషయంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చంద్రబాబును నిలదీస్తూ మీడియాతో మాట్లాడారు.ఫౌండేషన్లు, ట్రస్టులు పెట్టుకుని కాస్త హడావుడి చేసినంతమాత్రాన.. తోపుడు బండ్లు పంపిణీ చేసినంత మాత్రాన టికెటి ఇచ్చేస్తారా అంటు ప్రశ్నించారు. కొంతకాలంగా భాష్యం ప్రవీణ్ పేట టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. పార్టీకి రూ.78 లక్షల విరాళమిచ్చారు. నియోజకవర్గం మొ త్తం డబ్బులు బాగానే ఖర్చుపెడుతూ పార్టీలో యాక్టివ్ గా తిరుగుతున్నారు. ప్రవీణ్ విషయంలో ప్రత్తిపాటి పుల్లారావు టెన్షన్ కు లోనైనట్లు తెలుస్తోంది.
అయితే చంద్రబాబు పుల్లారావు, శివరామ్ పేర్లు ప్రస్తావించకుండా వార్నింగ్ ఇచ్చారు. క్రమశిక్షణ దాటితే ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. అసంతృప్తి ఉంటే నేరుగా తనతో, లేదంటే పార్టీలో ముఖ్యనేతలతో చెప్పుకోవాలన్నారు. అయితే అందుకు విరుద్ధంగా మీడియాలో మాట్లాడటం ఏమిటంటూ బాబు మండిపడ్డారు. ఈ ఇద్దరు నేతలను తన దగ్గరకు పిలిపించి మాట్లాడాలనుకుంటున్నట్లుగా బాబు భావిస్తున్నారు. సమయం కుదరకపోతే అచ్చెన్నాయుడికైనా ఆ బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అసమ్మతిని మొగ్గలోనే తుంచేయకపోతే అదే బాగా పెరిగి మహావృక్షమవుతుందని చంద్రబాబుకు తెలుసు. అందుకు తగ్గట్లుగానే ఆయన నిర్ణయాలుంటాయోమో చూద్దాం.












Click it and Unblock the Notifications