చేసిన మంచిపనులే చిరస్థాయిగా నిలిచేలా..
నారా లోకేష్ పాదయాత్ర తాజాగా పీలేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది.
రాజకీయవేత్తగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలంటే అందుకు తగ్గ మంచి పనుల్ని చేయాలి. ఆ పనులు చేసేటప్పుడు మన పార్టీవారా? ఎదుటిపార్టీ వారా? ఇది చేయడంవల్ల మనకు ఏం లాభం కలుగుతుంది? లాంటి లెక్కలేసుకొని చేస్తే అది మంచిపని అవదు. చెడ్డ పని అవుతుంది. స్వలాభం ఆశించకుండా, పార్టీ ఏదో చూడకుండా, మానవత్వంతో ఎదుటి మనిషికి సాయం అందాలని చేసేది మాత్రమే చిరస్థాయిగా నిలిచిపోతుంది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబునాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఈకోవకే చెందుతారు.
నారా లోకేష్ పాదయాత్ర తాజాగా పీలేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. నియోజకవర్గ పరిధిలోని చింతలవారిపల్లి మాజీ సర్పంచ్ అశోక్ లోకేష్ ను కలిశారు. వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా బ్యానర్లు తీసుకువస్తూ అశోక్ ప్రమాదానికి గురయ్యారు. దీంతో రెండునెలలపాటు మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని సహాయం చేయాలని కోరారు. ఈ విషయాన్ని నల్లారి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి cmrf ద్వారా రూ.30 లక్షల సాయం ఇప్పించారు. వాటిద్వారా చేసిన వైద్యంతో అశోక్ ప్రాణాలు నిలబడ్డాయి. కృతజ్ఞతలు తెలియజేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. అంత సాయం చేసిన కిషోర్ కుమార్ రెడ్డి ఈరోజు వరకు దాన్ని గురించి ఎక్కడా చెప్పలేదు.. తన గొప్పదనాన్ని చెప్పుకోలేదు. ఈ సన్నివేశం జరిగిన సమయంలోను కిషోర్ కుమార్ రెడ్డి అక్కడే ఉన్నప్పటికీ చాలా సాధారణంగా ఉండిపోయారు.

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు, యువత సమస్యలను పరిష్కరించేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర ప్రస్తుతం పీలేరు నియోజకవర్గ పరిధిలో కొనసాగుతోంది. 400 రోజులపాటు, 4వేల కిలోమీటర్లు జరిగే ఈ యాత్ర ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంవద్ద ముగియనుంది. రానున్న ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి నారా లోకేష్ సన్నద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications