వేమిరెడ్డి ప్రశాంతి ఆడియో లీక్ - టీడీపీ పై కీలక వ్యాఖ్యలు...!

నెల్లూరు జిల్లా రాజకీయం హోరా హోరీగా మారుతోంది. వేమిరెడ్డి వర్సస్ సాయిరెడ్డి ఎన్నికల యుద్దం కొత్త టర్న్ తీసుకుంది. కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య మాటల యుద్దం పెరుగుతోంది. వేమిరెడ్డి సతీమణి ప్రశాంతి కోవూరు నుంచి టీడీపీ అభ్యర్దిగా బరిలో నిలిచారు. కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సోదరుడు రాజేంద్రతో ప్రశాంతి మాట్లాడిన ఆడియో లీక్ అయింది. అందులో టీడీపీ నేతల పై ప్రశాంతి కీలక వ్యాఖ్యలు చేసారు.

ప్రశాంతి రెడ్డి ఫోన్ కాల్
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే సోదరుడికి ఫోన్ చేసి జిల్లా రాజకీయాల పైన మాట్లాడారు. తనకు ఆసక్తి లేకపోయినా టీడీపీ నుంచి వస్తున్న ఒత్తిడితో పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. ప్రభాకర్ రెడ్డి తనను వైసీపీ అమానించందని..ఆ పార్టీలో ఎలా ఉండమంటావని ప్రశ్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. గెలిస్తే ఎంపీ అవుతా..ఓడితే వ్యాపారం చేసుకుంటాననేది ప్రభాకర్ రెడ్డి చెబుతున్న మాటగా ఆడియోలో చెప్పుకొచ్చారు. తనను తొలుత సర్వేపల్లి నుంచి పోటీ చేయమన్నారని..ఆ తరువాత కోవూరుకు మార్చారని చెప్పుకొచ్చారు. ఆత్మకూరులో మేకపాటి విక్రమ్ గెలుస్తారని వ్యాఖ్యానించారు.

TDP contesting candidate Prasanthireddy Audio leaks goes viral crucial comments on TDP leaders

టీడీపీలో చేరిక పోటీ పై
కావలిలో ప్రతాప్ పైన వ్యతిరేకత ఉందన్నారు. ఈ ఆడియో ఇప్పుడు లీక్ అయింది. దీని పైన వైసీపీ ఎంపీ అభ్యర్ది సాయిరెడ్డి స్పందించారు. టీడీపీ నేత వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ప్రశాంతి రెడ్డిలకు రాజకీయాలంటే వ్యాపారంగా మారాయ‌ని విజయసాయిరెడ్డి విమ‌ర్శించారు. రాజేంద్ర కుమార్ రెడ్డి, ప్రశాంతిరెడ్డి టెలిఫోన్‌ సంభాషణ పరిశీలిస్తే వేమిరెడ్డి దంపతులు విజయం సాధించలేకపోతే రాజకీయాల్లో నుంచి నిష్క్రమిస్తారనేది స్పష్టమవుతోందన్నారు. దుబాయ్, సింగపూర్, ఇండోనేషియా, ఆఫ్రికా, ఇండియాల్లో వారి వ్యాపార లావాదేవీలు చూసుకుంటారే కానీ ప్రజాజీవితంలో ఉండరని వ్యాఖ్యానించారు. వారి మనోభావాలనే వారు వ్యక్తపరిచారని... ఇప్పుడు నెల్లూరు ప్రజలే నిర్ణయించుకోవాలని సాయిరెడ్డి సూచించారు.

TDP contesting candidate Prasanthireddy Audio leaks goes viral crucial comments on TDP leaders

బయట పెట్టిన ఎమ్మెల్యే సోదరుడు
నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ఏడు స్థానాలు గెలుస్తామని సాయిరెడ్డి ధీమా వ్యక్తం చేసారు. ప్రశాంతి రెడ్డి ఆడియోలో మాట్లాడిన రాజేంద్రకుమార్ రెడ్డి ఈవిషయం పైన స్పందించారు. వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జీవించి ఉన్నప్పటి నుంచీ ప్రస్తుతం జగన్‌ గారి బాటలో నడుస్తున్న కుటుంబం తమదని చెప్పారు. ఆనం రాంనారాయణ రెడ్డి గురించి ఆమె ఎంత చీప్ గా మాట్లాడారని..పదివేల ఓట్లతో ఓడిపోతారని బహిర్గతంగా తన చెప్పారని వివరించారు. రాజకీయ కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉన్నట్లు కనిపించవచ్చు కానీ..అవి విభేదాలు కాదన్నారు. ప్రశాంతి రెడ్డి ఆడియో ఇప్పుడు నెల్లూరు రాజకీయాల్లో ఎన్నికల వేడిని రెండు పార్టీల మధ్య మరింత రాజేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+