విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నో ఫ్యాన్..ఓన్లీ విసనకర్ర: కేశినేని శ్వేత: బ్లేజ్‌వాడలో ఎలా: ఎంత వినాశనం: ర్యాగింగ్ నెక్స్ట్ లెవెల్

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఎండకాలం సమీపిస్తే.. విజయవాడ ఎలా ఉంటుందో పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. విజయవాడలో స్థిరపడాలీ అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంటారు పొరుగు జిల్లాల ప్రజలు. దీనికి ప్రధాన కారణం.. వేసవిలో అక్కడ ఏర్పడే పరిస్థితులే. వేసవిలో విజయవాడలో 40-45 డిగ్రీల ఉష్ణోగ్రత సర్వ సాధారణంగా నమోదవుతుంటుంది. ఉక్కపోత దీనికి తోడుకావడం బోనస్. ఇంట్లో కూర్చోలేని పరిస్థితి.. బయట అడుగు పెట్టలేని దుస్థితిని అనుభవిస్తుంటారు బెజవాడ వాసులు. అందుకే ఈ నగరానికి బ్లేజ్‌వాడ అని పిలుస్తుంటుంటారు.

వేసవిలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే విజయవాడకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకురాలు, కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ కేశినేని శ్వేత.. సరికొత్త పంతం పట్టారు. వేసవి ఉక్కపోతలోనూ ఫ్యాన్ వేసుకోదలచుకోలేదనే సంకేతాన్ని ఇచ్చారు. నో ఫ్యాన్.. ఓన్లీ విసనకర్ర అంటూ ఓ కామెంట్‌ను ఆమె తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దానికి ఆరుబయట కూర్చుని విసనకర్రతో విసురుకుంటోన్న ఓ ఫొటోను జత చేశారు. విద్యుత్ కోతల వల్ల ఫ్యాన్‌ను వేసుకోలేకపోతున్నాని.. ఫలితంగా విసనకర్రతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని అర్థం కూడా స్ఫూర్తిస్తోంది అందులో.

TDP Corporation Kesineni Swetha tweeted as No fan, which YSRCPs election symbol

దీనిపై సోషల్ మీడియాలో పెద్ద డిబేటే సాగుతోంది. వైసీపీ, టీడీపీ సోషల్ మీడియా ప్రతినిధులు ఒకరికి మించి ఒకరు కామెంట్స్ చేసుకుంటున్నారు. తన ప్రత్యర్థి పార్టీ వైఎస్సార్సీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ కావడం వల్లే కేశినేని శ్వేత ఫ్యాన్‌ను పక్కన పెట్టారంటూ తెలుగుదేశం పార్టీ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఫ్యాన్‌ను పక్కన పెట్టడం మంచిదేనని, దానివల్ల రాష్ట్రానికి ఎంత వినాశనం జరుగుతోందో ప్రజలకు అర్థం కావడం లేదని అంటున్నారు. వైసీపీకి ర్యాగింగ్ చేయడం బాగుందంటూ కితాబిస్తున్నారు. భవిష్యత్తులో విజయవాడ మేయర్‌ అవుతారంటూ జోస్యం చెబుతున్నారు.

మొన్నటి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కేశినేని శ్వేత పోటీ చేసిన విషయం తెలిసిందే. 11వ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థినిగా ఆమె బరిలో నిలిచారు. ఘన విజయాన్ని అందుకున్నారు. తెలుగుదేశం పార్ట్టీ అత్యధిక డివిజన్లను గెలుచుకుని ఉంటే ఆమె మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసేవారు. ఆ ఎన్నికల్లో టీడీపీ మేయర్ అభ్యర్థినిగా ఆమెను ప్రొజెక్ట్ చేశారు. టీడీపీ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని కుమార్తె ఆమె. సొంత పార్టీకి చెందిన నేతల నిర్వాకం వల్లే టీడీపీ విజయవాడ కార్పొరేషన్‌పై తన జెండాను ఎగురవేయలేకపోయిందనే అభిప్రాయాలు ఇప్పటికీ వ్యక్తమౌతున్నాయి. పోలింగ్ ముగింట్లో కేశినేని నాని, బుద్ధా వెంకన్న మధ్య మాటల యుద్ధం నడిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

English summary
Kesineni Swetha, Newly elected TDP Corporator from 11th division in Vijayawada Municipal Corporation tweeted as No fan, Only Visanakarra in summer. Fan is the YSRCP's election symbol
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X