హరిబాబువే అబద్దాలు : కామినేనికి టీడీపీ కౌంటర్, కేంద్రానికి మార్చి 5 వరకు డెడ్ లైన్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: నవ్యాంధ్రకు కేంద్రం ఇచ్చిన నిధుల విషయంలో హరిబాబు మాటలను తప్పుపట్టాల్సింది ఏమీ లేదని, కేంద్రం ఏమిచ్చిందో అది మాత్రమే ఆయన చెప్పారన్న మంత్రి కామినేని శ్రీనివాస్ రావు వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు.

హరిబాబు చెప్పేవే అబద్దాలని, తిరిగి వాటిని బీజేపీ నేతలు సమర్థించడం మరింత దారుణమన్నారు. ఏపీకి జరిగిన నష్టంపై చర్చకు రావాలన్న బీజేపీ సవాల్‌కు సిద్ధమన్నారు.

TDP counter to minister Kamineni Srinivas Rao

నాలుగేళ్లు రాష్ట్రాన్ని పట్టించుకోకపోయినా ఊరుకున్నామని, ఇకపై ఊరుకునేది లేదని టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ వేరుగా అన్నారు. తాము మాత్రమే మిత్ర ధర్మాన్ని పాటిస్తే సరిపోదని, బీజేపీ కూడా పాటించాలన్నారు. మార్చి 5 నాటికి ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపకపోతే పార్లమెంట్‌లో పోరాటానికి సిద్ధమన్నారు.

ఏపీ ప్రత్యేకంగా ఏమీ కోరడం లేదని, చట్టంలోని చేయాలని మాత్రమే అడుగుతున్నామన్నారు. బీజేపీ రాష్ట్రానికి కావాలసినవన్నీ చేస్తే తాము నిరసన తెలియజేసే అవసరమే లేదన్నారు. రాష్ట్ర అవసరాలు తీర్చలేదు కాబట్టే తాము నిరసన తెలియజేస్తున్నామన్నారు. కనీసం మిత్ర ధర్మకం కూడా కేంద్రం పాటించడంలేదని, సహనానికీ హద్దు ఉంటుందన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Desam Party leader counter to minister and AP BJP leader Kamineni Srinivas Rao.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి